వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

లొంగిపోయిన మావోయిస్టు దళసభ్యుడికి ఆర్థికసాయం

April 5, 2019

వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌రవీందర్‌
మావోయిస్టు దళసభ్యుడికి చెక్‌ను అందజేస్తున్న సిపి రవీందర్‌
లొంగిపోయిన తెలంగాణ రాష్ట్ర కమిటి సిపిఐ మావోయిస్టు పార్టీ, సిఆర్‌బి ప్రెస్‌ ‌టీం సభ్యుడు కడవంచ యాకస్వామి అలియాస్‌ ‌సంతోష్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన ఒక లక్ష రూపా యల ఆర్థిక సాయాన్ని గురువారం పోలీస్‌ ‌కమిషనర్‌ ‌రవీందర్‌ ‌చేతుల మీదుగా అందజేశారు. కడవంచ యాకస్వామి జనగామ జిల్లా జఫర్‌గడ్‌ ‌మండలం తిమ్మంపేట గ్రామానికి చెందినవాడన్నారు. తెలంగాణ ప్రజావేదిక నాయకుల ప్రోత్సాహంతో యాకస్వామి గత సంవత్సరం జనవరి మాసంలో మావోయిస్టు పార్టీలో చేరాడని, అప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర కమిటి కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ ‌హరిభూషణ్‌ ‌ప్రొటెక్షన్‌ ‌టీం సభ్యుడిగా 5 నెలలు పనిచేశాడన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర కమిటీ, సిపిఐ మావోయిస్టు పార్టీ సిఆర్‌బి ప్రెస్‌ ‌టీం సభ్యుడిగా పనిచేస్తూ అనారోగ్యానికి గురయ్యాడన్నారు. అనారోగ్యానికి గురికావడంతో ప్రభుత్వం ప్రకటించిన మావోయిస్టు పునరావాస పథకానికి ఆకర్షితుడై మావోయిస్టు పార్టీని వీడి గత సంవత్సరం సెప్టెంబర్‌ 19‌న వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌రవీందర్‌ ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్‌ ‌కమిషనర్‌ ‌మాట్లాడుతూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలువాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయాన్ని వినియోగించుకొని సమాజంలో గౌరవవంతమైన జీవితాన్ని గడుపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ ‌బ్రాంచ్‌ ఏసిపి శ్రీనివాస్‌, ఇన్సిపెక్టర్‌ ‌రవికిరణ్‌లు పాల్గొన్నారు.