Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలయ్యేలా పటిష్ట చర్యలు

  • ధాన్యం కొనుగోళ్ల పక్రియను వేగవంతం చేయాలి: వీడియో
  • కాన్ఫరెన్స్‌లో సిఎం కేసీఆర్‌
  • ‌యంత్రాంగం అప్రమత్తంగా ఉంది 
  • వేగంగా ధాన్యం కొనుగోళ్లకు చర్యలు:
  • సిఎం కేసీఆర్‌కు వివరించిన  జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి, సిపి డేవిస్
‌సిద్ధిపేట, మే 21 (ప్రజాతంత్ర బ్యూరో): రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోవిడ్‌పై జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ ‌కమిషనర్లు, పోలీస్‌ ‌సూపరిండెంట్లతో శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. సిఎం కేసీఆర్‌ ‌నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిద్ధిపేట కలెక్టరేట్‌ ‌నుంచి కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి, పోలీస్‌ ‌కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవిస్‌ ‌పాల్గొన్నారు.  లాక్‌డౌన్‌ అమలు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన జరిగిన చర్చలో సిఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ…అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలును కఠినతరం చేస్తూ క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా పటిష్ట చర్యలు చేపట్టాలని, కొరోనా రెండో దశ వ్యాధి వ్యాప్తి నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని దవాఖానలలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ అధికారులకు కఠిన లాక్‌డౌన్‌ అమలు, పాజిటివ్‌ ‌కేసులను నియంత్రించేందుకు పలు సూచనలు చేశారు.
లాక్‌డౌన్‌ ‌క్షేత్ర స్థాయిలో కఠినంగా అమలు చేయాలని, ఉదయం 10 గంటల తర్వాత పాస్‌లున్నవారిని మాత్రమే అనుమతించాలని, తద్వారా పాజిటివ్‌ ‌కేసుల పెరుగుదలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన అభివర్ణించారు. ఉదయం 10 గంటలు తర్వాత ఎలాంటి అనుమతి లేకుండా బయటికి వచ్చిన వారి వాహనాలు సీజ్‌ ‌చేసి వారిపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నిబంధనల అమలులో పోలీస్‌ ‌యంత్రాంగానిదే క్రియాశీలక పాత్ర అని ఆయన గుర్తు చేశారు. కొరోనా రెండో దశ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లోని ఆసుపత్రుల్లో వైద్యులను అప్రమత్తం చేస్తూ క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల కలెక్టర్లు సమీక్షిస్తూ కొరోనా వ్యాధి వ్యాప్తికి కళ్లెం వేసేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు.
ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు అన్ని మౌళిక సదుపాయాలు కల్పించాలని, అవసరమైన మెడిసిన్‌, ఆక్సిజన్‌ ‌సరఫరా ప్రతినిత్యం అందుబాటులో ఉండేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధి వ్యాప్తికి మొదట్లోనే అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలో చేపట్టిన ఇంటింటి సర్వేతో సత్ఫలితాలు సాధించామని సిఎం అన్నారు. దీనిద్వారా వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి ట్రీట్‌ ‌మెంట్‌ అం‌దించి వ్యాధి తీవ్రత ఎక్కువ కాకుండా ఉండేలా నియంత్రించడం జరిగిందని అన్నారు. కొన్ని జిల్లాలో ఈ సర్వే ఇంకా ప్రగతిలో ఉందని, ఈ సర్వే పూర్తయిన జిల్లాల్లో అవసరమైతే మరొకసారి ఇదే తరహాలో ఇంటింటి సర్వే చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని దవాఖానలలో బెడ్స్‌ల కొరత లేదని సిఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 28 వేలకు పైచిలుకు బెడ్స్ అం‌దుబాటులో ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని గ్రామాలలోని పాలకవర్గాలు ముందుగానే స్వీయ లాక్‌డౌన్‌ ‌ప్రకటించుకుని కొరోనా వ్యాధి నియంత్రణకు సహకరించాయని సిఎం అభినందించారు. అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. రోహిణికార్తె సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు మరో పంట వేసుకోవడానికి సన్నద్ధమయ్యేలా కొనుగోళ్ల పక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.  ఈ సందర్భంగా జిల్లాలో లాక్‌డౌన్‌ అమలు, కేసుల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ధాన్యం కొనుగోలు పక్రియపై జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామ రెడ్డి, సిపి  జోయల్‌ ‌డేవిస్‌  ‌ముఖ్యమంత్రికి వివరించారు. క్షేత్ర స్థాయిలో లాక్‌ ‌డౌన్‌ అమలుకు అన్ని చర్యలు చేపడుతున్నామనీ, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు పక్రియ సజావుగా జరిగేందుకు ధాన్యాన్ని సాధ్యమైనంత వేగంగా కొనుగోలు చేయడానికి తగిన చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ ‌ముఖ్యమంత్రికి తెలిపారు.

Leave a Reply