వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

లక్ష (క్ష్య) సాధనలో .. మెజారిటీ లో మనమే ముండుండాలి : హరీష్ రావు

April 7, 2019

ఉన్న మూడు రోజులు గట్టిగా పని చేయాలి అని ..లక్ష , లక్ష్య సాధనలోమనమే ముందుండాలి అని… మరో ముడు రోజుల్లో ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు దిశానిర్దేశం చేశారు.. సిద్దిపేట లో ఆదివారం తన నివాసంలో పట్టణ కౌన్సిలర్స్.. మూడు మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో హరీష్ రావు సమావేశం అయ్యారు.. లక్ష మెజారిటీ సాధించే దిశగా అందరం ఈ మూడు రోజులు కష్టపడాలి అని కోరారు.. ప్రజాప్రతినిధులు మన బూత్ కమిటీలు, 100 ఓటర్ల ఇంచార్జ్ లు ఈ మూడు రోజులు గడపగడపకు..ప్రతి ఇంటికి .ప్రతి మనిషిని కలవాలి అని చెప్పారు..ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలా పని చేశారో అదే స్ఫూర్తితో పని చేయాలని మన సిద్దిపేట గౌరవాన్ని కాపాడాలని ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీ తో విజయానికి కృషి చేయలన్నారు.. బూత్ వారిగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్లు వివరించారు.. ఈ సారి వేరే పార్టీ లకు ఏజెంట్లే లేరు.. ప్రచారానికి వచ్చిన వారు లేరు కాబట్టి పోయిన ఓట్లు కూడా టి ఆర్ ఎస్ పార్టీ కె పడే విదంగా బూత్ కమిటీలు, 100 ఓటర్ల ఇంచార్జ్ లు ప్రతి ఓటర్ ని కలవాలి అని కోరారు… అదే విధంగా గత ఎన్నికల కంటే 7వేల ఓట్లు కొత్తగా పెరిగాయి అని… ఈ ఎన్నికల్లో కొత్త ఓట్లు..మొన్న జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీలకు పడిన ఓట్లు కలిపి మనకే పడే విధంగా బూత్ స్థాయిలో పోలింగ్ శాతం పెంచే దిశగా పని చేయాలన్నారు.. మన మెజారిటీ పెరగాలి అంటే పోలింగ్ శాతం పెంచాలి.. సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో ముందున్నం.. గత ఎన్నికల్లో మెజార్టీ లో రాష్ట్ర స్థాయిలో మనమే ముందు ఉన్నాం.. ఈ ఎన్నికల్లో కూడా మెజారిటీ పెంచితే దేశ స్థాయి లో మన సిద్దిపేట గౌరవం పెరుగుతుంది..గ్రామాల్లో ఐక్యత తో కల్సి పని చేసి పోలింగ్ శాతాన్ని పెంచాలి.. ఈ మూడు రోజులు ప్రతి మనిషిని మూడు సార్లు కలవాలి..మన అభివృద్ధి..సంక్షేమ కార్యక్రమాలు వివరించాలి.కారు గుర్తుకు ఓటు వేయి మనాలని కోరారు…