Take a fresh look at your lifestyle.

రోడ్డు విస్తరణ పనులు వేగం పెంచాలి: కలెక్టర్‌

‌సూర్యాపేట, ప్రజాతంత్ర ప్రతినిధి): స్థానిక రోడ్డు విస్తరణ పనులు 15రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం పిఎస్‌ ‌రోడ్డులో రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌పి.రామాంజుల రెడ్డి పరిశీలించి మాట్లాడారు. పట్టణంలోని పోస్టు ఆఫీస్‌ ‌సెంటర్‌ ‌నుండి పుల్లారెడ్డి చెరువు వరకు గల రోడ్డు విస్తరణ పనులు నాణ్యత ప్రమాణాలతో జరగాలని, అలాగే చేపట్టిన పనులు 15రోజుల్లో పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే ప్రజా రవాణా వ్యవస్థను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్‌ ‌హెల్త్, ఈఈ, ‌కాంట్రాక్టర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply