Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీల మృతి

జిల్లా పులివెందు మద్దనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జీపు, కారు, మున్సిపల్‌ ‌ట్రాక్టర్‌ ‌ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు మృత్యువాతపడ్డారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పులివెందుల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు పులివెందుల మండలం ఇ.కొత్తప్లలె వాసులుగా గుర్తించారు. గాయపడిన ఆరుగురిలో పారిశుధ్య కార్మికులు, మరికొందరు మహిళా రైతు కూలీలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.

Leave a Reply