వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రైతుల మోములో చిరునవ్వు

March 30, 2019

58 లక్షల మంది రైతులకు రైతుబంధు
ఎన్నికల ప్రచార సభల్లో కెటిఅర్‌
రాష్ట్రంలో ప్రస్థుత సమయంలో రైతులందరు చిరునవ్వులు చిందిస్తున్నారని, రైతులను అదుకోవడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుదే పై చెయ్యిగా ఉందని, కెసిఅర్‌ ‌ప్రవేశపెడుతున్న పధకాలను చూసి ఇతర రాష్ట్రాలు, ప్రధానిమోదీ సైతం కాఫీ కొడుతున్నారని తెరాస కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శనివారం పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 75 శాతం సీట్లు ఇచ్చి దీవించారని, గతంలో ములుగుకు వచ్చిన కెసిఅర్‌ ‌ములుగు వెనుకబడిన ప్రాంతమని జిల్లా ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేస్తానని హమీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా ములుగు మండలంలో ఉన్న మల్లంపల్లి గ్రామాన్ని సైతం మండలంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కెసిఅర్‌ ‌పాలన దేశ వ్యాప్తంగా అదరణ పొందిందని, రైతు బందు పధకం ద్వారా దాదాపు 58 లక్షల మంది రైతులకు రైతు లబ్ది పొందారని, మన పథకాలను ప్రధాని మోడీ సైతం కాపీ• కొట్టి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌పథ•కాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆంధ్రలో సైతం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పేరిట రైతులకు పంట పెట్టుబడిని అందిస్తున్నారని, అది కేవలం కెసిఅర్‌ ‌గొప్పతనమని అన్నారు. రాష్ట్రంలో రైతులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయని, వారి కుటుంబాలు కష్టపడకుండా రైతు బీమా పథకం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గిరిజన తండాలను గుర్తించి గ్రామ పంచాయితీలుగా మార్చడం జరిగిందన్నారు. పోడు భూములకు ముఖ్యమంత్రి ములుగులో కూర్చొని ఫారెస్టు అధికారులను పిలిచి పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. దేవాదుల నీటితో రాబోయే సంవత్సర కాలంలో ములుగు నియోజకవర్గం కళకళలాడటం చూస్తారని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేసింది ఏమి లేదని, అలాగే రాహుల్‌ ‌గాందీ సైతం చేసింది ఏమి లేదని ఎద్దేవా చేశారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికలలో తెరాస పార్టీ అత్యధికంగా 16సీట్లు గెలిచి తీరుతుందన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థులకు వోటు వేయడం వలన మురిగిపోవడం తప్ప ఏమీ లేదని, తెరాస పార్టీనుండి బరిలో ఉన్న మాలోతు కవితను అత్యధిక మేజార్టీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. తమతో కలిసి రావడానికి చాలా పార్టీలు ఉన్నాయని, బిజేపికి, కాంగ్రెస్‌కు ఎక్కడ సీట్లు రావని అన్నారు. 16కు 16 సీట్లు గెలుచుకొని కేంద్రంలో మన జెండా ఎగురవేయ్యాలని అన్నారు. దీంతో కేంద్రంలో మన ఎంపిలు కొట్లాడి నిధులు తెచ్చి దేవాదుల, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించుకోవాలన్నారు. జాతీయ పార్టీలతో అభివృద్ధి సాధ్యమని సొల్లు కబుర్లు చెప్పకుండా వారి నోర్లు మూయించాలన్నారు. ఈనెల 11న మాలోతు కవితకు వోట్లు వేసి అత్యధిక మేజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయితీ రాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి చందులాల్‌, ‌మాజీ ఎంపి సీతారాం నాయక్‌, ‌పార్లమెంట్‌ అభ్యర్థి మాలోత్‌ ‌కవిత, సత్యవతిరాథోడ్‌, ‌తెరాస పార్టీ అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు.