వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రైతుల పోటీ..టీఆరెస్ పతనానికి నాంది

April 5, 2019

నిజామాబాద్‌, ‌కరీంనగర్‌లలో కాంగ్రెస్‌ ‌గెలుపు ఖాయం : జీవన్ రెడ్డి
నిజామాబాద్‌లో 178 మంది రైతులు పోటీ చేయడంతోనే తెరాస పతనం ఖాయమైందని.. ఈ సారి కవితను ఇంటికి సాగనంపుతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అన్నారు.అయిదేళ్ల కాలంలో నిజామాబాద్‌ ‌తెరాస ఎంపీ కవిత ఏం చేశారని ప్రశ్నించారు. గత ఐదేళ్లు ఏ చేయకపోయినందున ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. జగిత్యాల నుంచే కవిత ఓటమి. జగిత్యాల గ్రాణ మండలం లక్ష్మీపూర్‌ ‌విత్తన శుద్ధి కేంద్రం శంకుస్థాపన చేసి ఎందుకు పనులు చేపట్టలేదో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్రంలో రాహులు ప్రధాని కావడం ఖామమని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో పొన్నం విజయం ఖాయమని అన్నారు. తెరాస రాష్ట్రంలో 16 స్థానాలు సాధిస్తామని కలలు కంటుందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ ‌రైతులు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని అడిగితే ఇవ్వలేని వారు రైతుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజామాబాద్‌ ఎన్నికల్లో మధుయాస్కీగౌడ్‌ను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త పని చేస్తామని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లిని గెలిపించేందుకు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. ఈ సారి అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా చెబుతున్నాయని..ఈ ఎన్నికల్లో తెరాస పతనం ఖాయమన్నారు. తెరాస, ఏపీలో వైఎస్‌ఆర్‌ ‌పార్టీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేరన్నారు.