భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో నాగినేని ప్రోలు రెడ్డిపాలెం సారపాక ప్రాంతంలో సాగు పోడు భూములు రైతులపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బూర్గం పాడు తహశిల్దార్ కి సమస్యల పై వినతి పత్రం అందించడం జరి గింది. ఈ కార్యక్రమంలో సిపియం నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 40 సంవత్సరాల నుండి సాగుచేసుకుంటున్న ఎస్టీల భూముల్ని బలవంతంగా హరి• •హారం పేరుతో మొక్కలు నాటాలని ప్రయత్నిస్తున్న ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలు ఆపాలని హైకోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయకుండా ఫారెస్టు రెవెన్యూ జాయింట్ గా సర్వే చేయాలని నిర్ణయించు కోవటం జరిగింది. నిబంధనలు లెక్కచేయకుండా రాత్రులు ఫారెస్ట్ అధికారులు పోడు భూములు దున్నటం ఇలాంటి చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు భూమి మీదకి ఎవరు వచ్చినా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు భూముల కోసం ప్రజలు ఎక్కడికైనా దేనికైనా సిద్ధంగా ఉంటారని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దళితులకు 3 ఎకరాల ఎస్టీలకు పోడు భూములకు పట్టాలు ఇస్తానని జిల్లాలో మూడు రోజులు ఉండి పోడు భూములకు పరిష్కారం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు మూడు ఎకరాల భూమి కాదు కదా వారి దగ్గర ఉండ మూడు ఎకరాలు భూమిని లాక్కోవాలని చూస్తున్న ప్రభుత్వం ఓట్లు కు వచ్చినప్పుడు ఒక మాట గెలిచిన తర్వాత మరొక మాట దళితులకు గిరిజనులకు పోడు భూమి ఇవ్వకుండా ఉంటే ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉంటామని అన్నారు. పోడు భూములు జోలికి రావద్దని గతంలో ఇచ్చిన ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూడవ తూదసురు భూక్య ఫుల్ సింగ్ ,భూక్య హుస్సేను, బానోతు కమల బానోతు కాంతి అజ్మేరా చోరీ బానోతు రాజి తదితరులు పాల్గొన్నారు.