Take a fresh look at your lifestyle.

రైతులకు శుభవార్త

రబీ పంట కనీసం మద్దతు ధర 50 నుంచి 109 వరకు శాతం పెంపు
కేంద్ర కేబినేట్‌ ‌నిర్ణయం
బిఎస్‌ఎన్‌ఎల్‌ను మూసేయడంలేదని స్పష్టం
నరేంద్ర మోదీ మంత్రివర్గం బుధవారం దేశంలోని రైతాంగానికి శుభవార్త చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధరని పెంచింది. గోధుమలు, పప్పులు, కాయధాన్యాలు, ఆవాల పంటల తాజా ఉత్పత్తులు త్వరలోనే మార్కెట్‌కు రాబోతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. పంటను బట్టి ఎంఎస్‌పీని 50 శాతం నుంచి 109 శాతం వరకు పెంచింది. కేబినేట్‌ ‌తీసుకున్న కేంద్ర మంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌డియాకు వివరించారు. గోధుమల మద్దతు ధర క్వింటాలుకు రూ.85 పెంచినట్లు తెలిపారు. పప్పులు, బార్లీ, కాయధాన్యాలు, ఆవాలకు కూడా మద్దతు ధరలను క్వింటాలుకు 50 శాతం నుంచి 109 శాతం వరకు పెంచామన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్నదాతలకు కాస్త ఊరటనివ్వగలదు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో మరొకటి ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ. వచ్చే ఏడాది ఢిల్లీ శాసన సభకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో తీసుకున్న ప్రజాకర్షక నిర్ణయమిది. ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌మాట్లాడుతూ ఢిల్లీలోని అనధికారిక కాలనీల్లో నివసించే 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సుమారు 40 లక్షల మందికి సంతోషాన్నిచ్చే విషయాన్ని కేంద్రం ప్రకటించింది. గుర్తింపులేని కాలనీల్లో నివసించే వారికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నగరంలో ఉన్న సుమారు 1797 గుర్తింపులేని కాలనీలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనను అమలు చేసేందుకు పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశంలో బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర గృహనిర్మాణ మంత్రి హరిదీప్‌ ‌సింగ్‌ ‌పురి చెప్పారు. కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని మరో మంత్రి హర్ష్ ‌వర్ధన్‌ ‌స్వాగతించారు. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 200 గజాలు ఉన్న ఇంటి స్థలానికి ఒక శాతం పన్ను వసూల్‌ ‌చేయనున్నట్లు భావిస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ ‌రిటెయిల్‌ ‌మార్కెట్‌లో కొత్త కంపెనీలకు అనుమతులివ్వాలని నిర్ణయించినట్లు జవదేకర్‌ ‌చెప్పారు. దీనివల్ల పోటీ పెరుగుతుందని, పెట్టుబడులను ఆకర్షించవచ్చునని, కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు.
బిఎస్‌ఎన్‌లో పెట్టుబడుల ఉపసంహరణ లేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఎం‌టీఎన్‌ఎల్‌ను మూసివేయడం లేదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌స్పష్టం చేశారు. కేంద్ర క్యాబినెట్‌ ‌తీసుకున్న నిర్ణయాలను ఆయన డియా సమావేశంలో తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో పెట్టుబడులను ఉపసంహరించడం లేదన్నారు. థార్డ్ ‌పార్టీకి కూడా ఆ సంస్థలను అప్పగించడం లేదని తెలిపారు. అయితే రెండు సంస్థలను విలీనం చేసే ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. రబీ పంటలపై కనీస మద్దతు ధరను పెంచాలని క్యాబినెట్‌ ‌నిర్ణయించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌తెలిపారు. గోధుమ, బార్లీపై ఎంఎస్‌పీని 85 రూపాయిలు పెంచినట్లు మంత్రి చెప్పారు. బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎం‌టీఎన్‌ఎల్‌ ‌సంస్థలను మూసివేస్తారా. ఈ రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. తీవ్ర నష్టాలతో బతుకీడుస్తున్న ఆ రెండు సంస్థలను విలీనం చేయాలని భావిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విలీనంతో ఆ రెండు సంస్థలను బలోపేతం చేయనున్నట్లు మంత్రి రవిశంకర్‌ ‌చెప్పారు. రెండు కంపెనీలు లాభాల్లో నడవాలంటే ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. జాతీయ ప్రయోజనాల దృష్టా ఆ రెండు సంస్థలను విలీనం చేయాలని ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి రవిశంకర్‌ ‌తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. క్రమబద్దంగా రెండు సంస్థలను విలీనం చేస్తామని అన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎం‌టీఎన్‌ఎల్‌లను మూసివేయడం గానీ, వాటాల ఉపసంహరణ గానీ జరగదని తేల్చి చెప్పారు. ఈ రెంటినీ విలీనం చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ‌సూతప్రాయ ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు. తీవ్ర నష్టాలతో నడుస్తున్న ఈ రెండు సంస్థలు ఇప్పుడున్న పోటీని తట్టుకుని, లాభాలబాటలో నడవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం కేంద్రం సావరిన్‌ ‌బాండ్ల రూపేణా రూ.15,000కోట్లు పెట్టుబడి పెట్టేటట్లు, వాటి స్వంత అస్థుల ద్వారా 38,000కోట్లు సకరించేట్టు ప్రయత్నిస్తుందని మంత్రి చెప్పారు. ఈ రెండు సంస్థల ఉద్యోగుల కోసం ఒక ఆకర్షణీయమైన స్వచ్చంద పదవీవిరమణ పథకాన్ని కూడా తీసుకురానున్నట్లు, అందుకోసం రూ. 30వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు. 2010 నుండీ ఈ రెండు ప్రభుత్వరంగ సంస్థలు నష్టాలను చవిచూస్తూనేఉన్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌ ‌తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించు కోవడానికి 2015లోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

Leave a Reply

error: Content is protected !!