Take a fresh look at your lifestyle.

రేపు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

దళితబంధు, అసెంబ్లీ సమావేశాలపై చర్చ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు జరుగనున్నది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో 16వ తేది మధ్యాహ్నం 2గంటలకు సమావేశం జరుగనున్నది. శాసనసభ సమావేశాల నిర్వహణతో పాటు దళితబంధు పైలెట్‌ ‌ప్రాజెక్టు అమలుపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం హుజూరాబాద్‌తో పాటు వాసాలమర్రిలో పైలెట్‌ ‌ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నది.

మరో నాలుగు గ్రామాల్లోనూ పైలెట్‌ ‌ప్రాజెక్టును అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం కార్యక్రమం ఉన్నతస్థాయి సవి•క్ష సైతం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశంలో పథకం అమలుపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply