వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మరం

September 10, 2019

భద్రతకు పోలీసుల చర్యలుభాగ్యనగరంలో రేపు(గురువారం) జరుగనున్న గణెష్‌ ‌నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. అధికారులు, పోలీసులు పలు చర్యలకు శ్రీకారం చుట్టారు. 18 కిలోటర్ల మేర బాలాపూర్‌ ‌గణెష్‌ ‌శోభాయాత్ర ఉంటుందని ట్రాఫిక్‌ అదనపు డీసీపీ అనిల్‌ ‌కుమార్‌ ‌వెల్లడించారు. గణెష్‌ ‌శోభాయాత్రకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శోభాయాత్ర మధ్యలో ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కీలక ప్రాంతాల్లో ఉన్నతాధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. భక్తులు తమ వాహనాలను నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిలపాలలని ఆయన స్పష్టం చేశారు. నిమజ్జనం జరిగే 30 గంటలపాటు నగరంలోకి లారీల అనుమతి లేదని, ట్రాఫిక్‌ ‌పోలీసులు సూచించిన దారిలోనే ఆర్టీసీ బస్సులు వెళ్లాలని ఆయన తెలిపారు. నిమజ్జనాలు చూసేందుకు వచ్చేవారు మెట్రోలో రాకపోకలు సాగించడం మంచిదని అనిల్‌ ‌కుమార్‌ ‌సూచించారు.