Take a fresh look at your lifestyle.

రెండోసారి అధికారంలోకి … కమలదళం

మరోసారి ప్రధాని కానున్న నరేంద్ర మోడీ
కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా – అమేథీలో రాహుల్‌ ‌పరాజయం.వయనాడ్‌లో విజయం
ఉత్తరాదిని ఊపేసిన కమలం..దక్షిణాదిలో పాగా – 2014 ఫలితాలను మించిన విజయం బిజెపి సొంతం
ప్రపంచ నేతల..బిజెపి సీనియర్ల అభినందనలు

: దేశంలో మరోమారు బిజెపి అధికారంలోకి రానున్నది. మోడీ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ప్రకటించారు. భారత రాజకీయాల్లో రెండుసీట్లతో మొదలైన బిజెపి ప్రస్థానం రెండోసారి కూడా అధికారం చేజిక్కుంచుకునే సత్తా చాటింది. దీంతో దేశవ్యాప్తంగా 2014ను మించి 2019 ఫలితాల్లో బిజెపి ఆధిక్యం చాటబోతోంది. 300 సీట్లు సొంతంగా సాధిస్తామన్న బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా మాటలునిజం కాబోతున్నాయి. కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలల్లో కూడా బిజెపి దూసుకుని పోవడం ఈ ఎన్నికల ఫలితాల్లో మరో విశేషంగా చెప్పాలి. అలాగే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు కూడా ఆధిక్యంలో దూసుకెళ్తు న్నాయి. మొత్తం 542 స్థానాలకు గానూ.. 355కిపైగా స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 90 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యూపీఏ కూటమి, 97 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చాలా చోట్ల ప్రముఖుల సైతం వెనుకంజలో ఉన్నారు. అమేథీలో రాహుల్‌ ‌గాంధీ వోటమిపాలైయ్యారు. ఆయనపై పోటీపడ్డ కేంద్రమంత్రి స్మ•తి ఇరానీ గెలుపొందారు. అయితే కేరళ వయనాడ్‌లో మాత్రం రాహుల్‌ ‌గాంధీ విజయం సాధించారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే దూసుకెళ్తోంది. మొత్తం 80 నియోజకవర్గాలుండగా.. 56 చోట్ల భాజపా ఆధిక్యంలో ఉంది. ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థులు 16చోట్ల ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ ‌కేవలం 2 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇక గత ఎన్నికల్లో క్లీన్‌ ‌స్వీప్‌ ‌చేసిన గుజరాత్‌లోనూ భాజపా జోరు కొనసాగుతోంది. గుజరాత్‌లో మొత్తం 26 స్థానాలుండగా.. 22 చోట్ల భాజపా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కర్ణాటకలో భాజపా ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్‌ ‌మొత్తం 28 స్థానాల్లో 22 చోట్ల భాజపా అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 20 చోట్ల భాజపా ముందంజలో ఉంది. భోపాల్‌లో దిగ్విజయ్‌ ‌సింగ్‌పై ప్రగ్యాసింగ్‌ ‌ఘన విజయం సాధించారు. ఇక రాజధాని ఢిల్లీలోని 7 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్‌ ‌పోల్‌ ‌ఫలితాలను నిజం చేస్తూ పాలకపక్ష బీజేపీ దూసుకుపోతోంది. ఫలితాల సరళి చూస్తుంటే 2014 ఎన్నికల్లో వచ్చిన 282 సీట్లను దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రంలో బీజేపీ, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు నువ్వా, నేనా అన్నట్లు హోరా హోరీగా ముందుకు సాగుతుండడం విశేషం. బెంగాల్‌లోని మొత్తం 42 సీట్లకుగాను 18 సీట్లలో బీజేపీ తన ఆధిక్యతను కొనసాగిస్తోంది. మరోపక్క కర్ణాటకలో కూడా ముందుగా ఊహించినట్లుగానే 28 సీట్లకుగాను 23 సీట్లలో బీజేపీ తన ఆధిక్యతను కొనసాగిస్తోంది. గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే సగానికి సగం సీట్లు పడిపోతాయనుకున్న ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ హవా కొనసాగుతుండడం ఉత్తర, కేంద్ర రాష్ట్రాల్లో ఆ పార్టీ సష్టిస్తోన్న ప్రభంజనానికి నిదర్శనం. యూపీలో 54 సీట్లలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తోండగా, బీఎస్పీ,ఎస్పీ కూటమి ఆధిక్యత 23 సీట్లకే పరిమితమైంది. ఎగ్టిజ్‌ ‌పోల్‌ అం‌చనాలను నిజం చేస్తూ బీహార్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌ ‌రాష్ట్రాల్లో బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతోండగా, నవీన్‌ ‌పట్నాయక్‌కు కంచుకోటైన ఒడిశాలో కూడా బీజేపీ పది సీట్లకు దక్కించుకునే దిశగా దూసుకుపోతుండడం ఆశ్చర్యం కలిగించక మానదు.ఇకపోతే ఇవిఎలంను అడ్డం పెట్టుకుని ఢిల్లీలో నానాయాగీ చేసిన వారికి ఫలితాలు గుణపాఠం కానున్నాయి. కలకత్తా కాళినంటూ బెంగాల్లో బీద అరుపులు అరిచిన మమతకు కర్రుకాల్చి వాతపెట్టారు. హిందువులు బొందువుల అంటూ ఎకసక్కెంగా మాట్లాడిన తెలంగాణ సిఎం కెసిఆర్‌కు కూడా కర్రుకాల్చి వాతపెట్టారు. అధికార మత్తులో ఉన్న ఆయనకు కూతురు కవితను ఓడించి ప్రజాగ్రహాన్ని చూపారు. తెలంగాణలో రెక్కడ అన్న కెసిఆర్‌కు నాలుగు స్థానాలల్లో గెలిచి ఇదీ మా అడ్రస్‌ అని చూపారు. మొత్తంగా బిజెపి వరుసగా రెండోసారి సునా సృష్టించి విపక్షాల చిల్లర కూటమిని చిత్తు చేసింది.

మోడీకి సుష్మా అభినందనలు
దేశవ్యాప్తంగా భాజపా విజయం దిశగా దూసుకెళుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్‌ ‌నేత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ ‌ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ సారథ్యంలో భాజపా అతిపెద్ద విజయం సొంతం చేసుకుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీజీ.. భాజపాకు అతిపెద్ద విజయాన్ని కట్టబెట్టిన కు శుభాకాంక్షలు. పార్టీ విజయానికి కారణమైన ప్రజలందరికీ ధన్యవాదాలు అని ట్విటర్‌ ‌వేదికగా స్వరాజ్‌ ‌తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దేశవ్యాప్తంగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యం దిశలో ఉంది. దీంతో దిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ కార్యాలయాల్లో పండగ వాతావరణం నెలకొంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy