వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రెండేళ్లుగా నిర్వహణకు నోచుకోని టెట్‌

August 2, 2019

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)‌కు గ్రహణం పట్టింది. రెండేళ్లుగా ప్రభుత్వం టెట్‌ను నిర్వ హిం• •డంలేదు. ఓవైపు టీఆర్‌టీ ద్వారా ఉపా ధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి నివ్వడం తోపాటు మరో వైపు బీసీ గురుకులా ల్లోనూ టీచర్‌ ‌పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. కానీ, ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిన టెట్‌ ‌గురించి మాత్రం పట్టించుకోవడంలేదు. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణలో కలిపి ఆరుసార్లు టెట్‌ ‌నిర్వహించారు. ఒక్కసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఏడేళ్ల పాటు చెల్లుతుంది. అయితే ఆరు టెట్‌లలో మొదటి మూడింటి చెల్లుబాటు గడువు ఇప్పటికే ముగిసింది. పైగా తెలంగాణలో టెట్‌ ‌నిర్వహించి సోమవారంతో రెండేళ్లు పూర్తయింది. అయినా టెట్‌ ‌నిర్వహణ అంశాన్ని విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. దీంతో టెట్‌ ‌నిర్వహించకుండానే గురుకుల పోస్టులకు నోటిఫికేషన్‌ ‌జారీ చేస్తారేమోనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రభుత్వం ఇటీవల టీఆర్‌టీ ద్వారా 1698 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ ఒక్క నోటిఫికేషన్‌ ‌మినహా భవిష్యత్తులో మరోసారి టీఆర్‌టీ ఉంటుందో, లేదో తెలియని పరిస్థితి. దాంతో ప్రస్తుతం గురుకుల టీచర్‌ ‌పోస్టులకైనా ప్రిపేర్‌ ‌కావాలనే ఉద్దేశంలో అభ్యర్థులు ఉన్నారు. కానీ మొదటి మూడు టెట్‌లలో కలిపి తెలంగాణలో రెండు లక్షల మంది అభ్యర్థులు టెట్‌ ‌వ్యాలిడిటీని కోల్పోయారు.తెలంగాణలో నిర్వ హించింది రెండుసార్లే
తెలంగాణలో మొదటి సారిగా 2016 మే, 2017లో టెట్‌ ‌నిర్వహి ంచారు. తర్వాత రెండేళ్లలో బీఎడ్‌, ‌డీఎడ్‌ ‌పాసయిన వారి సంఖ్య 50 వేలకు పైగా ఉంటుంది. టెట్‌ ‌వ్యాలిడిటీ కోల్పోయిన వారు, కొత్తగా ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసుకున్న వారు కలిపి సుమారు 2.30 లక్షల మంది ఉన్నారు. వీరంతా టెట్‌ ‌కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎస్‌జీటీ పోస్టులకు బీఎడ్‌ ‌కోర్సు పూర్తి చేసినవారు కూడా అర్హులేనని సుప్రీంకోర్టు 2018లో తీర్పునిచ్చింది. అయితే ఎస్‌జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే టెట్‌ ‌పేపర్‌-1‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. దీంతో బీఎడ్‌ ‌చేసి గతంలో టెట్‌ ‌పేపర్‌-2‌లో క్వాలిఫై అయినవారు కూడా టెట్‌ ‌కోసం నిరీక్షిస్తున్నారు. వాస్తవానికి విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాతీయ స్థాయిలో సీటెట్‌, ‌రాష్ట్ర స్థాయిలో టెట్‌ ‌నిర్వహించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇది అమలు కాగా.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక దానిని ఏడాదికి ఒకేసారి నిర్వహించేలా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కానీ, రెండుసార్లు టెట్‌ ‌నిర్వహించాక.. రెండేళ్లుగా ఆగిపోయింది.

– రావుల రాజేశం,
అధ్యాపకులు