Take a fresh look at your lifestyle.

రెండుమూడు రోజుల్లో భారీ వర్షాలు

నగరంలో అర్ధరాత్రి జోరువానరానున్న మూడురోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షా లు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షా లు కురిశాయి. కరీంనగర్‌ ‌జిల్లా ఖాసీంపేటలో 62.8 మిల్లీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్‌ ‌జిల్లా నాగపూర్‌లో 58.8, వాడిలో 54, సంగారెడ్డి జిల్లా కంగ్టి లో 49, కామారెడ్డిలోని తాడ్వాయిలో 45.8, నిజామాబాద్‌లోని చిన్నమావందిలో 45.3 మిల్లీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌, ‌జగిత్యాల, రంగారెడ్డి, యాదాద్రి భువనగి, రాజన్న సిరిసి ల్ల, నాగర్‌ ‌కర్నూల్‌, ‌భద్రాద్రి కొత్త గూడెం, కొమ్రుం భీం ఆసిఫాబాద్‌, ‌పెద్దపల్లి, మేడ్చల్‌, ‌వికారాబా ద్‌ ‌జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన పడింది. నల్గొండలో అత్యధికంగా 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం, నడిరాత్రి వాన దంచికొట్టింది. రుతుపవనాల రాకతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం రాత్రి షేక్‌ ‌పేటలో 9.4 సెం. వర్షం పడింది. గచ్చిబౌలి 8.3 సెం., రాయదుర్గం 7.6 సెం., మాదాపూర్‌ 7.6 ‌సెం., ఆసీఫ్‌ ‌నగర్‌ 6.7 ‌సెం., జూబ్లీహిల్స్ 6.5‌సెం., మూసాపేట్‌ 6.4 ‌సెం., టోలిచౌకి 6.3సెం., ఫిలింనగర్‌ 6.3‌సెం., కూకట్‌ ‌పల్లి 5.6 సెం., బోరబండ 5.6 సెం., ఖైరతాబాద్‌ 5.4‌సెం., యూసఫ్‌ ‌గూడ 5.3 సెం., శ్రీనగర్‌ ‌కాలనీ 5 సెం., నాంపల్లి 4.9సెం., కొండాపూర్‌ 4.8‌సెం., మైత్రివనం 4.6సెం., కుత్బుల్లాపూర్‌ 4.2 ‌సెం. ల వర్షం పడింది. దీంతో జిహెచ్‌ఎం‌సి అప్రమత్తం అయ్యింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy