Take a fresh look at your lifestyle.

రెండున్నరేళ్లలో ఎపిలో అరాచక పాలన

  • ఇంతగా అప్రతిష్ట పాలైన ప్రభుత్వం లేదు
  • సైకో కారణంగా ఆర్థికంగా రాష్టాన్రికి నష్టం
  • టిడిపిని టార్గెట్‌ ‌చేస్తూ దాడులు చేస్తున్నారు
  • ఎక్కడా లేని మద్యం బ్రాండ్లతో పెద్ద ఎత్తున వ్యాపారం
  • జగన్‌ ‌సర్కార్‌పై మండిపడ్డ టిడిపి అధినేత చంద్రబాబు

అమరావతి,అక్టోబర్‌6: ‌రాష్ట్రంలో రెండున్నరేళ్లలో ఇంత అరాచకం, అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అవినీతి, అరాచకం, అబద్దాలలో తప్ప ప్రతి అంశంలోనూ సీఎం జగన్‌ ‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని చంద్రబాబు విమర్శించారు. ఇంతటి దారుణ పాలన చూడలేదన్నారు. ఒక సైకో నుంచి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఎదురైందని… పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జిలు, పార్లమెంట్‌ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు, ఇతర ముఖ్యనేతలతో నేడు చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏపీ సర్కారు ఆకృత్యాలను ప్రజల కోసం, రాష్ట్రం కోసం భరిస్తున్నామని, టీడీపీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో పోలీసులు, వైసీపీ గూండాలతో వీరోచితంగా పోరాడుతూ.. జైలుకు కూడా వెళ్లి వస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై దుష్పచ్రారం చేసి 2019 ఎన్నికల్లో వైసీపీ లబ్ది పొందిందని, ఒక అబద్దాన్ని వందసార్లు చెప్పి గోబెల్స్ ‌ప్రచారం చేశారని, నేడు అన్ని విషయాలు ప్రజల నిజజీవితంలో అవగతం అవుతున్నాయని టీడీపీ అధినేత తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. జగన్‌రెడ్డి మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారని, బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉపాధి హా బిల్లుల బకాయిలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. 12శాతం వడ్డీతో కలిపి బిల్లులు ఇవ్వాలని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుతోనైనా జగన్‌ ‌రెడ్డి తీరు మార్చుకోవాలని సూచాంచారు.

ఉపాధి హా పెండింగ్‌ ‌బిల్లుల చెల్లింపు విషయంలో టీడీపీ చివరి వరకూ పోరాడి విజయం సాధించిందని గుర్తుచేశారు. ఇప్పడు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదన్నారు. సుమారు రూ.70 వేల కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని చెప్పారు. టిడ్కో ఇళ్లను ఇంతవరకు లబ్దిదారులకు కేటాయించకుండా నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం కోసం ప్రభుత్వమే మద్యాన్ని బలవంతంగా తాగించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. లిక్కర్‌ ‌పై రూ. 75వేల కోట్లు అప్పు చేస్తున్నారని, ఆడబిడ్డల తాళిబొట్లతో కూడా ఆడుకునే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. ఏపీలో ఉండే మద్యం బ్రాండ్స్ ‌దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? మద్యం బ్రాండ్స్ ఎం‌దుకు మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు. సొంతంగా మద్యం తయారుచేసుకుంటూ, నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తూ డబ్బులు సంపాదించు కుంటున్నారని ఆరోపించారు. ఏపీని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని, గంజాయి, హెరాయిన్‌ అడ్డాగా రాష్టాన్న్రి మార్చారని తీవ్రంగా మండిపడ్డారు. డ్రగ్‌ ‌ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడతామని తెలిపారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తమ వంతు కృషిచేస్తామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో అభివృద్ధి జాడ అనేదే లేకుండా పోయిందని ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప ఏ లేదని..రాక్షస పాలతో ప్రభుత్వం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శలు సంధించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం టీడీపీ నేతలతో భేటీ అయిన సందర్భంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయించి వారి నోళ్లు మూయించేస్తున్నారని విమర్శించారు.

పాలన అనేదే లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యలనే ఎజెండాగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు. సంక్షేమం అని చెబుతు ప్రజల్నీ వనరుల్ని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా..విమర్శించినా..అక్రమ కేసులతో నోళ్లు మూయించేసే దాదాగిరీలో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని అన్నారు. అభివృద్ధి లేకపోవటంతో ఒక్కరూపాయి ఆదాయం లేక అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతల్ని టార్గెట్‌ ‌చేస్తు భయపెట్టాలని చూస్తున్నారని..టీడీపీ దేనికి..ఎవ్వరికి భయపడదనే విషయం వైసీపీ పార్టీ నేతలు.సీఎం జగన్‌ ‌గుర్తు పెట్టుకోవాలని..ఇటువంటివి చాలానే చూశాం.పాలన చేయటం మానేసి కక్ష సాధింపుతోనే టీడీపీని అణచివేయాలని చూస్తే అది జరిగేపనికాదనే విషయం తెలుసుకోవాలని అన్నారు. రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సీడీ, పంట నష్టం పరిహారాలు ఇవ్వట్లేదని రైతుల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదని విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టటంలేదని..కానీ అదిచేస్తున్నాం. ఇది చేస్తున్నాం అంటూ ప్రచార ఆర్భాటం మాత్రం చేసుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అప్పుల ఊబిలో ముంచేస్తు ప్రజలపై భారాలు మోపుతున్నారని అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంది వైసీపీ ప్రభుత్వంలోనని విమర్శించారు.

Leave a Reply