Take a fresh look at your lifestyle.

రూ.10లక్షల కోసం.. తల్లి హత్య..!

ప్రియుడు శశికుమార్‌తో కలిసే కీర్తి తల్లిని హతమార్చింది
గతంలోనే నిద్రమాత్రలు ఇచ్చి హతమార్చే యత్నం
దృశ్యం చిత్రానికి సీక్వెల్‌లా హత్య ఉదంతం సాగింది
ముగ్గురిపై కేసులు నమోదు చేశాం
విలేఖరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేశ్‌ ‌భగవత్‌
రూ. 10లక్షల కోసం తన ప్రియుడుతో కలిసి కీర్తీరెడ్డి తన తల్లి రజితను హతమార్చిందని రాచకొండ సీపీ మహేశ్‌ ‌భగవత్‌ ‌తెలిపారు. హయత్‌నగర్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలోని మునగనూరులో రజిత హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు గురువారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకం ప్రకారమే ఈనెల 19న ఆమెను హత్య చేశారని, నిందితులు కీర్తి, శశికుమార్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆస్తి, నగదు కోసమే కీర్తిరెడ్డిని శశికుమార్‌ ‌బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేయడం.. రజిత హత్యకు దారితీసిందని మహేశ్‌ ‌భగవత్‌ ‌స్పష్టం చేశారు. అయితే బాల్‌రెడ్డి అనే యువకుడు.. కీర్తితో ఫ్రెండ్‌షిప్‌ ‌పేరుతో స్నేహం చేశాడని, ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడని అన్నారు. అయితే కీర్తిని బాల్‌రెడ్డి అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చిందని, అప్పటికే శశికుమార్‌ ‌రెడ్డి అనే యువకుడు కీర్తిరెడ్డికి పరిచయమై ఉన్నాడని, ఆ పరిచయంతో కీర్తిరెడ్డిని ఆమన్‌గల్‌ ‌తీసుకెళ్లి అబార్షన్‌ ‌చేయించాడని తెలిపారు. అయితే ఈ అబార్షన్‌ను ఆసరాగా తీసుకున్న శశికుమార్‌.. ‌రజిత ఆస్తిపై కన్నేశాడని భగవత్‌ ‌తెలిపాడు. రజిత వద్ద ఉన్న రూ. 10 లక్షలు, ఆస్తి కోసం కీర్తిరెడ్డిని శశికుమార్‌ ‌బ్లాక్‌మెయిల్‌ ‌చేశాడని, ఆ ప్రాపర్టీని దక్కించుకోవాలనుకున్న శశికుమార్‌.. ‌రజితను అంతమొందించాలని ప్లాన్‌ ‌చేశాడని అన్నాడు. దీంతో పక్కా ప్రణాళికతో కీర్తిని బ్లాక్‌మెయిల్‌ ‌చేస్తూ.. తల్లి హత్యకు ప్రేరేపించాడని భగవత్‌ ‌వివరించాడు. అయితే రజితను చంపేందుకు గతంలోనే నిద్రమాత్రలు ఇచ్చినట్లు తమ విచారణలో తేలిందని సీపీ తెలిపారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో.. ఈ నెల 19వ తేదీన రజిత సొంతింట్లోనే చున్నీతో కీర్తి, శశిలు కలిసి
ఉరేసి చంపేశారని అన్నారు. రెండు, మూడు రోజుల తర్వాత ఒక బ్లాంకెట్‌లో రజిత మృతదేహాన్ని చుట్టి.. శశి కారులో రామన్నపేట రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లి వదిలేశారని వెల్లడించారు. మృతదేహాన్ని అక్కడ వదిలేసి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో దారి మధ్యలో పెట్రోల్‌ ‌తీసుకుని బ్లాంకెట్‌ను కాల్చేశారని, తమపై నేరం రాకుండా ఉండేందుకు యువతి, యువకుడు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యారని అన్నారు. బ్లాంకెట్‌ను కాల్చేసిన ఆధారాలు లభ్యమయ్యాయని, ఉరేసిన చున్నీ కూడా దొరికిందని తెలిపారు. రజిత హత్య కేసును విచారిస్తుంటే మొత్తం నాలుగు కేసులు బయటపడ్డాయని సీపీ తెలిపారు. ఒకటేమో రజిత మృతదేహంపై గుర్తు తెలియని డెడ్‌బాడీగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారని, మరో మూడు కేసులు.. రూ. 10 లక్షల కోసం కీర్తిని డిమాండ్‌ ‌చేస్తూ బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేశాడని, అంతేకాకుండా ఆమెపై అత్యాచారం చేశాడని, ఈ కేసులో డిమాండ్‌, అత్యాచారం, పోక్సో చట్టం కింద శశికుమార్‌ను అరెస్టు చేశామని తెలిపారు. ఇంక రెండో కేసు విషయానికి వస్తే రజిత హత్య కేసులో కీర్తిరెడ్డి, శశిని అరెస్టు చేశామని, ఇక మూడో కేసు.. కీర్తిరెడ్డిని అత్యాచారం చేయడంతో బాల్‌రెడ్డిని అరెస్టు చేశామని సీపీ పేర్కొన్నారు. మొత్తంగా ఈ మూడు కేసుల్లో కీర్తి, శశికుమార్‌, ‌బాల్‌రెడ్డిని అరెస్టు చేసి జ్యుడిషీయల్‌ ‌రిమాండ్‌కు తరలిస్తున్నామని తెలిపారు. విచారణ కోసం పోలీసు కస్టడీలోకి తీసుకుంటామని, ఈ కేసుల్లో భాగంగా మృతదేహాన్ని తరలించడానికి వాడిన శశి కారుతో పాటు నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని మహేశ్‌ ‌భగవత్‌ ‌తెలిపారు. ఈ ఘటన దృశ్యం చిత్రానికి ఇది రెండో పార్ట్‌గా కనిపిస్తుంది అని మహేశ్‌ ‌భగవత్‌ ‌పేర్కొన్నారు. తమపై నేరం రాకుండా కీర్తి, శశికుమార్‌ ‌చాకచాక్యంగా వ్యవహరించారని, రజితను చంపిన తర్వాత కీర్తి.. తన తల్లి గొంతు మాదిరిగా రజిత ఫోన్‌ ‌నుంచి బాల్‌రెడ్డికి ఫోన్‌ ‌చేసిందని, నేను వైజాగ్‌ ‌వెళ్తున్నా.. మా కూతురిని ఇంటికి పంపిస్తున్నానని బాల్‌రెడ్డితో కీర్తిరెడ్డి స్వరం మార్చి చెప్పిందని సీపీ తెలిపారు. కీర్తి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి వచ్చిన తర్వాత అసలు విషయం వెలుగు చూసిందని, మా తల్లి కనబడడం లేదని కీర్తి రెడ్డి స్వయంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఈ ఆలోచనలు ఎలా వచ్చాయి? అని స్టడీ చేయాల్సి ఉంటుంది అని రాచకొండ సీపీ చెప్పారు. ఈ కేసును త్వరగా చేధించిన హయత్‌నగర్‌ ‌పోలీసులను రాచకొండ సీపీ మహేశ్‌ ‌భగవత్‌ అభినందించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!