వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రికార్డు ధర పలికిన.. బాలాపూర్‌ ‌గణేష్‌ ‌లడ్డూ

September 12, 2019

రూ.17లక్షల60వేలకు సొంతం చేసుకున్న రాంరెడ్డిబాలాపూర్‌ ‌లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. గత రికార్డును బాలాపూర్‌ ‌లడ్డూ ప్రసాదం వేలం మించింది. గురువారం ఉదయం బాలాపూర్‌ ‌కూడలిలో జరిగిన వేలం పాటలో రూ. 17 లక్షల 60 వేలకు కొలను రాంరెడ్డి.. బాలాపూర్‌ ‌గణేష్‌ ‌లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా లింగాల కొలను రాంరెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. తొలిసారి బాలాపూర్‌ ‌గణేష్‌ ‌లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా కొలను రాంరెడ్డి అన్నారు. గతేడాది ఈ లడ్డూ రూ. 16.60 లక్షలకు శ్రీనివాస్‌ ‌గుప్తా అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ ఏడాది బాలాపూర్‌ ‌లడ్డూ వేలం పాటలో మొత్తం 19 మంది పాల్గొన్నారు. ఈ ఏడాది ఆంధప్రదేశ్‌ ‌కు చెందిన భక్తులు కూడా వేలం పాటలో పాల్గొనడం విశేషం. 1980 నుంచి బాలాపూర్‌ ‌వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. 1994లో వేలంపాట పెట్టగా నాడు రూ.450 పలికింది. 2019 నాటికి అది రూ.17.60 లక్షలకు చేరింది. క్రమంగా లడ్డూ వేలంలో విలువ పెరుగుతూ వస్తుందే కానీ తగ్గిన దాఖలాలు లేవు. వేలంపాటను ఉత్సవ కమిటీ చేపడుతుంది. పోటీదారులు ఎంతమంది పాల్గొంటారో వారి జాబితా తయారుచేసి వేలం ప్రారంభిస్తారు.