వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రాహుల్‌ ‌గాంధీ ప్రధాని కావడం ఖాయం

April 4, 2019

వనపర్తి రోడ్‌ ‌షో లో పార్లమెంటు అభ్యర్తి డా.మల్లు రవి
వనపర్తి పట్టణంలో బుధవారం నాడు కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో పాల కేంద్రం నుండి పెద్ద ఎత్తున బైక్‌ర్యాలి చేపట్టి రోడ్‌ ‌షోలో భాగంగా వనపర్తి రాజీవ్‌ ‌చౌరస్తాలో నాగర్‌కర్నూల్‌ ‌పార్లమెంటు అభ్యర్థి డా.మల్లురవి మాజీ మంత్రి చిన్నారెడ్డి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ‌పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతు పార్లమెంటు ఎన్నికల్లో దేశం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ గెలుపొంది దేశ ప్రధాని రాహుల్‌ ‌గాంధీ కావడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చి•న సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్‌ ‌పార్టీ మెనిఫెస్టోను ప్రజలకనుగుణంగా రూపొందించాలని ఎవరు ఎన్ని పార్టీలు మారిన తాను కాంగ్రెస్‌ ‌పార్టీలోనే వుంటానని క్రాస్‌ ‌పార్టీ ఆశయాలకనుగుణంగా పనిచేస్తానని పార్లమెంటు అభ్యర్థిగా కేంద్రంలో ప్రధాని రాహుల్‌గాంధీ కాబోతున్నారని మీరు ఇచ్చే తీర్పును శిరసావహిస్తానని వనపర్తి పట్టణంలో అండర్‌ ‌డ్రైనేజి రోడ్ల విస్తరణ చేపడతామని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని నిరంకుశ పాలనకు అవినీతి పాలన సాగిస్తున్న టిఆర్‌ఎస్‌ ‌ను ఓడించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ‌నాయకులు కార్యకర్తలు, బైక్‌ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.