Take a fresh look at your lifestyle.

రాహుల్‌ విమానంలో సాంకేతిక లోపం

ముంబయి: ఏవియేషన్‌పర్యవేక్షణ సంస్థ డిజిసిఎ రాహుల్‌గాంధీ ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన అంశంపై ఇద్దరుసభ్యుల దర్యాప్తు కమిటీని నియమించింది. కర్నాటక ఎన్నికల ప్రచారం కోసం రాహుల్‌ ఒక ఛార్టర్డ్‌ విమానంలో బయలుదేరారు న్యూఢిల్లీనుంచి ఉత్తర కర్నాటకలోని హుబ్బలికి గురువారం వచ్చింది. ఈ సాంకేతికలోపంపై తమకు అనుమానాలున్నాయని, వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌చేసింది. 10సీటర్‌ ఫాల్కన్‌2000 విమానం లోభూయిష్టంగా పనితీరు ఉందని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆరోపించింది. పౌరవిమానయానశాఖ డైరెక్టర్‌జనరల్‌ ఇద్దరుసభ్యులతోకూడిన ప్యానెల్‌ను ఈ సంఘటనపై విచారణజరపాలని ఆదేశించారు. వైమానికభద్రత విభాగానికి చెందిన ఒకసభ్యుడు, వైమానిక సామర్ధ్యం విభాగంనుంచి మరొకరు ఈ విచారణప్యానెల్‌లో ఉంటారని డిజిసిఎ సీనియర్‌ అధికారి వెల్లడించారు. వచ్చే రెండుమూడువారాల్లోనే ప్యానెల్‌ నివేదిక అందచేయాలని ఆదేశించారు. ఈ దర్యాప్తు తర్వాత ప్యానెల్‌ కాక్‌పిట్‌క్రూను విచారణకు పిలుపస్తుంది. అంతేకాకుండా విమానం ఇంజనీర్లనుసైతం ఈ సంఘటనపై ప్రశ్నిస్తుంది. అవసరమైతే కమిటీ నిర్వహణ సిబ్బందినిసైతం ఈ విమాన ప్రయాణానికి పిలుస్తుంది. గురువారం ఈ ఫాల్కన్‌ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. ఎయిర్‌క్రాప్ట్‌ ఆపరేటర్‌ నివేదికప్రకారంచూస్తే ఆటోపైలట్‌మోడ్‌లో సాంకేతికలోపం అని పైలట్‌ మాన్యువల్‌మోడ్‌కు బదలాయించి విమానాన్ని సురక్షితంగా కిందకు దించారని అన్నారు. అయితే ఆటోపైలట్‌మోడ్‌ నిలిచిపోవడం అసాధారణమైన అంశమని ఎయిర్‌లైన్స్‌ అధికారులు చెపుతున్నారు. విఐపి విమానం ఎవరికోసం వచ్చినా డిజిసిఎ ముందు క్షుణ్ణంగాపరిశీలిస్తుంది. బయలుదేరేసమయంలోనే పరీక్షిస్తామని అధికారులు తెలిపారు. కర్నాటక రాష్ట్ర డిజిపి నీలమణి ఎన్‌రాజు, గాంధీకి అత్యంత సన్నిహితుడైన కౌశల్‌ విద్యార్ధిలు మాట్లాడుతూ వాతావరణం సాధారణంగానే ఉందని ఎలాంటి ఇబ్బందులులేవన్నారు. విమానంలోనే సాంకేతికలోపంతో సందేహాలు తలెత్తుతున్నాయని ఈలోపం వాతావరణానికి సంబంధించినది కాదని సాంకేతికపరంగా తలెత్తినవేనని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా రాహుల్‌ ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందన్న సమాచారం తెలియడంతోప్రధాని నరేంద్రమోడీ తన చైనాపర్యటనకు ముందు రాహుల్‌తోటెలిఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. రాహుల్‌భద్రతపై అధికారులను అడిగి తెలుసుకోవడంతోపాటు రాహుల్‌గాంధీకి ప్రధాని మోడీ స్వయంగా ఫోన్‌చేసారు. రాహుల్‌కు మధ్యాహ్నం 2.30 గంటలకు మొబైల్‌కాల్‌ వచ్చిందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. కర్నాటక ఎన్నికల ప్రచారంకోసం రాహుల్‌ రెండురోజులపర్యటనకుగాను విమానంలో బయలుదేరిన సంగతి తెలిసిందే.విమాన సాంకేతికలోపంపై ప్రధాని మోడీ రాహుల్‌కు స్వయంగాఫోన్‌చేసి ఆయనభద్రతపై వివరణ అడిగి తెలుసుకున్నారు. మొత్తం అధికారులందరూ సాంకేతికలోపంపై వివరించడంతో ప్రధాని స్వయంగా రాహుల్‌కుఫోన్‌చేసి వివరాలు అడిగారు. రాహుల్‌తోపాటు మరికొందరు నేతలున్న న్రపైవేటు విమానం న్యూఢిల్లీనుంచి కర్నాటకలోని హుబ్బలికి బయలుదేరింది. ఎడమపక్క భారీగా ఒరిగిపోవడంపై హడలిపోయారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!