Take a fresh look at your lifestyle.

రాష్ట్ర సరిహద్దులో భయం…భయం

అడవీప్రాంతంలో కాల్పుల మోత..ప్రతీకారచర్యలు
మావోయిస్టుల వారోత్సవాలు తిప్పికొట్టేందుకు భారీగా కూంబింగ్‌
‌వారోత్సవాలు ముగియకముందే 9 మంది మావోయిస్టుల మృతిసరిహద్దుల్లో ప్రజలు హడలెత్తిపోతున్నారు.చర్యలు,రపతీకారచర్యలతో అటవీప్రాంతంలో తీవ్ర భయానకవాతావరణం నెలకొంది.మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభమయి కేవలం మూడురోజులు మాత్రమే గడిచాయి.ఇప్పటికే అటవీప్రాంతమంతా అట్టుడికిపోతుంది.పోలీసుబలగాలకు,మావోయిస్టులకు ప్రతీరోజు కాల్పుల యుద్దం జరుగుతూనే ఉంది.ఇటుపోలీసులు అటు మావోయిస్టులు ఇరువర్గాలు ఏమాత్రం తగ్గడంలేదు.నువ్వానేనే…అన్నట్లుగా అగవీప్రాంతంలో యుద్ధవాతావరణం ఉంది.ఒకప్రక్క భారీ వర్షాలు కురుస్తున్నాయి.వర్షాలను కూడా లెక్కచేయకుండా పోలీస్‌బలగాలు అడవీప్రాంతంలో కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నారు.అటు మావోయిస్టులు కూడా పోలీస్‌బలగాలపై ప్రతిఘటిస్తున్నారు.ఈ సంఘటనతో ఇప్పటివరకు మావోయిస్టులు తీవ్రంగా నష్టపోయారు.రెండు రోజులుగా ఇరువురి మధ్య జరుగుతన్న కాల్పుల్లో ఇప్పటివరకు 9మంది మావోయిస్టులు నేలకొరిగారు.
తెలంగాణ,ఛత్తీస్‌ఘడ్‌ ‌సరిహద్దుల్లో తీవ్ర భయానక వాతావరణం నెలకొంది.మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభించిన నాటినుండే పోలీసు బలగాలు అటవీప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు.మావోయిస్టుల వారోత్సవాలను తిప్పికొట్టేందుకు ప్రత్యేక వ్యూహం పన్నుతున్నారు.ఇందులో భాగంగానే ఇరువురి మధ్య కాల్పులు మొదలైయ్యాయి.మావోయిస్టుల వార్సోవాలు ప్రారంభమై మూడురోజులు సమయంలోనే 9 మంది మావోయిస్టులను కాల్పుల్లో హతమార్చారు.మావోయిస్టులు సమావేశాలు నిర్వహిస్తున్నారే సమాచారంతో ఆప్రాంతాలకు చేరుకుని సమావేశంను నిర్వీర్యం చేసారు.పోలీస్‌బలగాలను ఎదుర్కొనేందుకు మావోయిస్టులు కూడా భారీగానే ప్రతిఘటిస్తున్నారు.ఈ సంఘటనలతో సరహద్దు ప్రాంతాలలో యుద్దవాతావరణం నెలకొంది. అమాయక ప్రజలు తీవ్రభయాందోళన చెందుతున్నారు.వివిధ పనులపై బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.ఒక పక్క భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ వర్షాలను లెక్కచేయకుండా ఇటు పోలీసులు అటవీప్రాంతాలలో భారీగా కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నారు.అటువైపు మావోయిస్టులు కూడా పోలీసు బలగాలను కవ్వింపు చర్యలకు పాల్పడుతూ సమావేశాలు ఏర్పాటు చేసి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. పోలీస్‌బలగాలు భారీగా అటవీప్రాంతాల• • కాకుండా సరహద్దున ఉన్న గ్రామాలను చుట్టుముట్టినప్పటికీ ఏదోపక్కన మావోయిస్టులు పోలీసులకు ఛాలెంజ్‌గా బ్యానర్లు,వాల్‌పోస్టర్లు,కరపత్రాలు వదిలివెళుతున్నారు.దీంతో భారీగా బలగాలను మోహరించినట్లు సమాచారం.ఇప్పటికే శనివారంనాడు ఛత్తీస్‌ఘడ్‌లోని బస్తర్‌జిల్లా తిరియాగ్రామం అటవీప్రాంతంలో పోలీసులకు,మావోయిస్టులకు మద్య జరిగిన కాల్పుల్లో 7గురు మావోయిస్టులు మృతిచెందారు.అలాగే సోమవారంనాడు కూడాఛత్తీస్‌ఘడ్‌లోని సుకుమా జిల్లా కుంట పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో అటవీప్రాంతంలో ఇరువురి మద్య కాల్పులు జరిగాయి.ఈ సంఘటనలో 2 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్‌ అధికారులు వెల్లడిస్తున్నారు.వారి వద్ద నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.మృతి చెందిన ఇద్దరు మావోయిస్టు మృతదేహాలను ,వారివద్ద ఉన్న సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy