వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రాష్ట్రం అప్పుల పాలైంది..!

September 3, 2019

  • ఆర్థిక దుస్థితిలో ప్రభుత్వం – జీతాలు ఇవ్వలేని పరిస్థితి.
  • కేసీఆర్‌పై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా।। లక్ష్మణ్‌.

 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాటలు కోటలు దాటుతున్నాయని రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన డియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని, తెలంగాణ అప్పులమయమైందన్నారు. తెలంగాణ సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారని, వారి జీవితాలిప్పుడు ప్రశ్నార్థకంలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ప్రయివేట్‌ ‌సంస్థలు కోట్లు గడిస్తుంటే… ఆర్టీసీ మాత్రం నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ప్రతి అంశాన్ని పొరుగు రాష్ట్రంతో పోల్చే సీఎం కేసీఆర్‌ ఏపీ ఆర్టీసీలో జరుగుతున్న సంస్కరణలు కనబడడం లేదా? అని లక్ష్మణ్‌ ‌ప్రశ్నించారు. ఉద్దేశ్య పూర్వకంగానే ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల్లో కురుకుపోయేలా చేస్తోందని విమర్శించారు. ప్రయివేట్‌ ‌ట్రాన్స్‌పోర్ట్ ‌వ్యవస్థకు
అడ్డు అదుపు లేకుండా పోయిందని, టిఆర్‌ఎస్‌ ఏ ‌టింగ్‌ ‌పెట్టినా ఆర్టీసీ బస్సులను వాడుకొని డబ్బులు ఎగ్గొడుతోందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ లోపాలు సరిదిద్ది గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కార్మికుల శ్రేయస్సు కోసం బీజేపీ పోరాడుతుందని లక్ష్మణ్‌ ‌స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌కుటుంబపాలనతో మంత్రులు, ఎమ్మెల్యేలు అభద్రతాభావంతో కుంగిపోతున్నారని లక్ష్మణ్‌ అన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవల మాట్లాడిన తీరు చూస్తే టీఆర్‌ఎస్‌ ‌పరిస్థితి తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌పాలన మునిగిపోయే నావలా తయారైందని, కేసీఆర్‌ అవినీతి పాలనను అంతమొందించడం బీజేపీకే సాధ్యమని అన్నారు. ఎన్నికల ముందు కేటీఆర్‌..అరచేతిలో వైకుంఠం చూపి వోట్లు దండుకున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న మతతత్వ పార్టీ మజ్లిస్‌తో టీఆర్‌ఎస్‌ అం‌టకాగడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని లక్షణ్‌ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.