Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా

  • తాజాగా 24 గంటల్లో 3,840 పాజిటివ్‌ ‌కేసులు నమోదు
  • సర్వత్రా ఆందోళన

రాష్ట్రంలో కొరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి.  గురువారం రాత్రి 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ ‌బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ‌బారినపడి మరో తొమ్మిది మంది మరణించారని పేర్కొంది. కొత్తగా 1,198 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కొలుకొని ఇండ్లకు వెళ్లారు. భారీగా పెరుగుతున్న కేసులతో రాష్ట్రంలో క్రియాశీల కేసులు 30 వేలు దాటాయి. ప్రస్తుతం 30,494 యాక్టివ్‌ ‌కేసులున్నాయని, 20,215 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపింది. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‌ఎం‌సీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, నిజామాబాద్‌లో 303, సంగారెడ్డిలో 175 అత్యధికంగా కొవిడ్‌ ‌కేసులు నమోదయ్యాయి. గురువారం ఒకే రోజు రాష్ట్రంలో 1,21,880 కొరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 3,41,885కు చేరగా, ఇప్పటి వరకు 3,09,594 మంది కోలుకున్నారు. మహబూబాబాద్‌ ‌టీఆర్‌ఎస్‌ ఎం‌పీ మాలోతు కవితకు కొరోనా పాజిటివ్‌ ‌నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు కవిత వెల్లడించారు. అలాగే  సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డికి కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గత రెండు మూడు రోజులుగా జలుబుతో బాధపడుతున్న ఎస్పీ కొరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. వైరస్‌ ‌లక్షణాలు ఏవి• లేకపోయినా పాజిటివ్‌గా రావడంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఎస్పీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి ఇప్పటికే కొరోనా టీకా రెండు డోసులు తీసుకున్నా ఆయనకు వైరస్‌ ‌సోకడం గమనార్హం.

Leave a Reply