కొత్తగా 401 మందికి పాజిటివ్…ఒక్కరు మృతి
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఫిబ్రవరి 19 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కేసులు క్రితం రోజుకన్నా తగ్గాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 401 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తాజాగా 401 కొరోనా కేసులు నమోదు కాగా..వైరస్ కారణంగా ఒక్కరు మృత్యువాత పడ్డారు. ఇక జిహెచ్‌ఎంసి పరిధిలో కొత్తగా 124 కేసులు నమోదవగా, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 26 కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 7,86,422 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,109గా ఉంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7,76,667 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య మరింత తగ్గి 5,646గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.