Take a fresh look at your lifestyle.

రాత్రి 9 దాటితే… సీఎం ఇలాఖాలో ఆగని బస్సులు

  • ప్రయాణికుల కష్టాలు ఇన్నిన్ని కావాయె..
  • నిద్రావస్థలో ఆర్టీసీ అధికారులు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజ్ఞాపూర్‌-‌గజ్వేల్‌ ‌సిద్ధిపేటలో ఆర్టీసీ బస్‌లు ఆగనంటున్నాయి. కాదు, కాదు నాన్‌ ‌స్టాప్‌ అం‌టూ ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు బస్‌లు ఆపడం లేదు. బస్‌లు ఆపకపోవడం వల్ల ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. రాత్రి 9గంగలు దాటిందంటే చాలూ…ప్రజ్ఞాపూర్‌-‌గజ్వేల్‌, ‌ములుగు, కుకునూర్‌పల్లి, కొమురవెళ్లి, దుద్దెడ చౌరస్తా, సిద్ధిపేట తదితర ప్రాంతాలలో ఆర్టీసీ బస్‌లు ఆపకపోవడం వల్ల ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావనీ చెప్పాలి. వివరాల్లోకి వెళ్లితే…ప్రతి నిత్యం  ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాకు చెందిన సిరిసిల్ల, వేములవాడ, మంథని, కరీంనగర్‌, ‌మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ‌జగిత్యాల తదితర ఆర్టీసీ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్‌లు సిద్ధిపేట, ప్రజ్ఞాపూర్‌-‌గజ్వేల్‌ ‌మీదుగా సికింద్రాబాద్‌(‌జూబ్లీ బస్‌స్టేషన్‌), ‌హైదరాబాద్‌(ఎం‌బిబిఎస్‌) ‌బస్‌లు వెళ్తుంటాయి. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు సికింద్రాబాద్‌, ‌హైదరాబాద్‌ ‌వెళ్లే(వన్‌ ‌మ్యాన్‌ ‌సర్వీస్‌, ‌గరుడ,నాన్‌ ‌స్టాప్‌)అన్ని ఆర్టీసీ బస్‌లను సిద్ధిపేట, దుద్దెడ చౌరస్తా, కొమురవెళ్లి, కుకునూర్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌-‌గజ్వేల్‌ ‌తదితర ప్రాంతాలలో ఆపుతుంటారు. ప్రయాణికులను తీసుకుంటారు. దించుతారు. కానీ, రాత్రి 9గంటల తర్వాత సికింద్రాబాద్‌(‌జూబ్లీ బస్‌ ‌స్టేషన్‌), ‌హైదరాబాద్‌(ఎం‌బిబిఎస్‌) ‌నుంచి కరీంనగర్‌, ఆసిఫాబాద్‌,
‌మంచిర్యాల వైపు వెళ్లే బస్‌లలో సిద్ధిపేట, దుద్దెడ చౌరస్తా, కొమురవెళ్లి, కుకునూర్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌-‌గజ్వేల్‌ ‌వైపు వెళ్లే ప్రయాణికులను మాత్రం ఎక్కించుకోవడం లేదు. రాత్రి 9గంటల తర్వాత నాన్‌ ‌స్టాప్‌ ‌సర్వీసులంటూ ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ససేమిరా అంటున్నారనీ పలువురు ప్రయాణికులు ‘ప్రజాతంత్ర’తో మాట్లాడుతూ తెలిపారు. పొద్దంతా ఎక్కించుకుంటున్న కండక్టర్లు, డ్రైవర్లు రాత్రి వేళ మాత్రం నాన్‌ ‌స్టాప్‌ ‌పేరిట ప్రయాణికులను ఎక్కించుకోకపోవడం వల్ల జూబ్లీ బస్‌ ‌స్టేషన్‌లో ప్రతి నిత్యం వందలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నామన్నారు. ఇదేమని ఎవరైనా ప్రయాణికులు కండక్టర్లు, డ్రైవర్లను అడిగితే రాత్రి వేళ సిద్ధిపేట, దుద్దెడ చౌరస్తా, కొమురవెళ్లి, కుకునూర్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌-‌గజ్వేల్‌ ‌తదితర ప్రాంతాలలో ఆగవనీ, నాన్‌ ‌స్టాప్‌ ఉం‌డటం వల్లనే ఆపడం లేదంటూ రుస రుసలాడుతున్నారనీ  ప్రయాణికులు వాపోయారు. పొద్దంతా ఆపుతున్నప్పుడు రాత్రిపూట ఎందుకు ఆపరంటూ ఎవరైనా ప్రయాణికులు ప్రశ్నిస్తే స్టాప్‌ ‌లేకపోవడం వల్లే ఆపడం లేదనీ, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండనీ కండక్టర్లు, డ్రైవర్ల నుంచి దురుసుగా సమాధానం వినాల్సి వస్తుందనీ ప్రయాణికులు తమ బాధల్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సిద్ధిపేట, దుద్దెడ చౌరస్తా, కొమురవెళ్లి, కుకునూర్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌-‌గజ్వేల్‌ ‌ప్రాంతాలలో ఆపడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతారన్నంటూ…ఒక్కోసారి ప్రయాణికులకు ప్రయాణికులకు మధ్య గొడవలు పెట్టిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు లేకపోలేదనీ సిద్ధిపేటకు చెందిన పలువురు ప్రయాణికులు జూబ్లీ బస్‌ ‌స్టేషన్‌లో స్వయంగా ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. రాత్రి వేళ సిద్ధిపేట, దుద్దెడ చౌరస్తా, కొమురవెళ్లి, కుకునూర్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌-‌గజ్వేల్‌ ‌ప్రాంతాలలో ఆర్టీసీ బస్సులను ఆపడం లేదంటూ అనేకమార్లు ప్రయాణికులు సంబంధిత ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందనీ  ఈప్రాంతానికి చెందిన పలువురు ప్రయాణికులు పేర్కొన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే ఆర్టీసీ బస్‌లను నాన్‌ ‌స్టాప్‌ ‌పేరిట ఆపకపోవడం వల్ల రాత్రి వేళలో ముఖ్యంగా మహిళా ప్రయాణికులు, చిన్నారులు ఉన్నప్పుడు పడే బాధలు చెప్పలనవి కావన్నారు. ఇక పండుగల పూట బాధలు మరీ ఎక్కువన్నారు.  ఆర్డీనరీ, పల్లె వెలుగు బస్‌లకు సైతం ఎక్స్‌ప్రెస్‌ ‌బోర్డులు తగిలించి అధిక ఛార్జీలను వసూళ్లు చేస్తుంటారనీ, ఈ బస్‌లను కూడా ఆపడం లేదన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకలోనే ఆర్టీసీ బస్‌లను ఆపకపోవడం వల్ల సిద్ధిపేట, దుద్దెడ చౌరస్తా, కొమురవెళ్లి, కుకునూర్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌-‌గజ్వేల్‌ ‌తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా  రాత్రి వేళ ఆర్టీసీ బస్‌లను ఆపకపోవడం పట్ల ఈ ప్రాంతానికి చెందిన ప్రయాణికులు, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు తాజాగా…సోషల్‌ ‌మీడియా వేదికగా పోరాటాన్ని మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత ఆర్టీసీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు నిద్రావస్థలో ఉన్నారననే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట, దుద్దెడ చౌరస్తా, కొమురవెళ్లి, కుకునూర్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌-‌గజ్వేల్‌, ‌ములుగు తదితర ప్రాంతాలలో ఆర్టీసీ బస్‌లను ఆపాలని కోరుతున్నారు. పొద్దున పూట ఆపుతున్న కండక్టర్లు, డ్రైవర్లు రాత్రి పూట నాన్‌ ‌స్టాప్‌ ‌పేరిట ఆపకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రానున్న రోజులలో బస్‌లను ఆపేందుకు ప్రయాణికుల నుంచి పెద్దయెత్తున నిరసన వ్యక్తమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy