Take a fresh look at your lifestyle.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ

  • వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ఫోన్‌ ‌ట్యాపింగ్‌
  • ‌దీనిపై సత్వర విచారణ చేయాలని కాంగ్రెస్‌ ‌నేతల డిమాండ్‌

కేంద్ర ప్రభుత్వం తమ ఫోన్లను హ్యాక్‌ ‌చేస్తుందంటూ వొస్తున్న ఆరోపణల క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతలు ఇందిరా పార్కు నిరసనకు దిగారు. ఏఐసీసీ పిలుపుతో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ ‌యాదవ్‌ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ ప్రముఖులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్త్తుందని కాంగ్రెస్‌ ‌నాయకురాలు గీతారెడ్డి అన్నారు. మోడీ అధికారంలోకి వొచ్చాక ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకికవాద దేశంగా ఉంచడం ఇష్టంలేకనే సిఏఏ తెచ్చారన్నారు. సామాన్య ప్రజల కోసమే కాంగ్రెస్‌ ‌పోరుబాట పట్టిందన్నారు. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెరుగుదలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని..ప్రతిపక్షాల నోరు మూసేందుకే వారిపై నిఘా పెట్టిందని ఆరోపించారు. రాహుల్‌ ‌గాంధీతో పాటు తన దగ్గర పని చేసేవారిపై కూడా నిఘా కేంద్రం పెట్టిందన్నారు. బ్రిటిష్‌ ‌వారికంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ట్యాపింగ్‌ ‌పెద్ద నేరమన్న గీతారెడ్డి..అమిత్‌ ‌షాను బర్తరఫ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీతో విచారించడంతో పాటు, సుప్రీమ్‌ ‌కోర్టు సిట్టింగ్‌ ‌న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. ఎలక్షన్‌ ‌కమిషనర్‌ ‌ఫోన్‌ ‌ట్యాప్‌కి గురికావడం సిగ్గుచేటన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతుందని కాంగ్రెస్‌ ‌మరో నాయకుడు దాసోజు శ్రవణ్‌ అన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని లూటీ చేస్తూ దొంగ పిల్లులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూలిపోతుందనే భయం మోడీకి పట్టుకుందన్నారు. దైర్యం ఉన్న వాళ్ళెవరూ ఇలాంటి పనులు చేయలేరన్నారు. మోడీ ప్రభుత్వం మతపరమైన భావనలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటుందన్నారు. కేసీఆర్‌ ఇం‌టిదొంగ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తుల డేటా మొత్తం ఉంది అంటూ స్యయంగా జయేష్‌ ‌రంజన్‌ అనే అధికారి చెప్తున్నదంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవొచ్చన్నారు.

మోడీ, కేసీఆర్‌లు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్న దాసోజు..సీరియస్‌ అం‌శాలను మాట్లాడుకునేవారు ఫ్లైట్‌ ‌మోడ్‌లో పెట్టుకొని మాట్లాడండని తెలిపారు. వొచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే కనుక మోడీ, కేసీఆర్‌ ‌లాంటి దొంగలకు శిక్ష వేస్తామని స్పష్టం చేశారు. మోదీ పెగాసిస్‌ ‌సాప్ట్ ‌వేర్‌తో ఫోన్లను ట్యాప్‌ ‌చేస్తున్నారని దాసోజు శ్రావణ్‌ ఆరోపించారు. మన ఫోన్లను మొత్తం పెగాసిస్‌ ‌సంస్థ తన కంట్రోల్‌లోకి తీసుకున్నదని, ప్రైవసీ యాక్ట్ ‌ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని అన్నారు. యాక్ట్‌ను ఉల్లంఘించిన మోదీ దేశ ద్రోహి అని, భయంతోనే ప్రతిపక్షాలు, జడ్జీలు, వి•డియా ఫోన్లని ట్యాప్‌ ‌చేస్తున్నారని విమర్శించారు.

సీఎం కేసీఆర్‌ ‌కూడా ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేస్తున్నారని.. కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇద్దరూ ఒక్కటేనన్నారు. పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని దాసోజు శ్రావణ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌తో హక్కులకు భంగం కలిగిస్తున్నారని, దొంగచాటు కుట్రలను అడ్డుకోవాలన్నారు. సమాచారాన్ని మొత్తం విదేశాల చేతుల్లో పెడుతున్నారని, దేశ భద్రతకు ప్రధాని మోదీ, అమిత్‌ ‌షా ముప్పు తెస్తున్నారని ఆరోపించారు. దొంగతనం చేసి..దొంగ మాటలు చెబుతున్నారన్నారు. బీజేపీ పాలనలో అనేక మంది కవులు, మేధావులు చంపబడ్డారని సీతక్క దుయ్యబట్టారు.

Leave a Reply