Take a fresh look at your lifestyle.

రఫేల్‌ ‌పై కేంద్రానికి క్లీన్‌ ‌చిట్‌

  • రాహుల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ‌కొట్టివేత
  •   విస్త•త ధర్మాసనానికి  ‘శబరిమల’
  • రఫెల్‌పై గతంలో ఇచ్చిన తీర్పును పునఃసక్షించాల్సిన అవసరం లేదని వెల్లడి
  • రాహుల్‌ ‌వ్యాఖ్యలపై సున్నితంగా హెచ్చరించిన సుప్రీమ్‌కోర్టు
  • ‘శబరిమల’  ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ

రఫేల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి ఊరట లభించింది. రఫేల్‌ ‌విమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. సక్ష పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు, ఇటీవల సుప్రీంతీర్పుని సవాల్‌ ‌చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ ‌భూషణ్‌, ‌మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ ‌శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ ‌విచారించిన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. అలాగే కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. తద్వారా వివాదాస్పదమైన రాఫెల్‌ ‌కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చిన్టటైంది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్‌ ‌సంస్థ నుంచి 36 రాఫెల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ 2018 డిసెంబర్‌ 14‌న తీర్పు వెలువరించింది. అయితే, తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. దీనిపై దాఖలైన సక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్‌ ‌డీల్‌ ‌పక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్దారించింది.
శబరిమల వివాదం ఇదీ..
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం ఈ నాటిది కాదు. మహిళల హక్కులకు, భక్తుల విశ్వాసాలకు, కోర్టు తీర్పులకు, ప్రభుత్వ నిర్ణయాలకు నడుమ ఈ వివాదం ఏళ్లుగా నలుగుతోంది. ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్నిఎత్తేస్తూ.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు- కొందరికి మోదాన్ని, మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది. దీనిపై హింసాత్మక నిరసనలు కొనసాగాయి. కేరళలో రాజకీయంగా ఎదగడానికి శ్రమిస్తున్న భాజపా- శబరిమల వివాదాన్ని ఓ అస్త్రంగా వాడుతుండటం, దాన్ని నిలువరించేందుకు లెప్ట్‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వం ప్రయత్నించడంతో ఇదో రాజకీయ రణక్షేత్రంగానూ మారింది. ఆలయంలోకి ప్రవేశించడానికి పలువురు మహిళలు ప్రయత్నించినప్పటికీ.. ఈ ఏడాది జనవరిలో ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్లగలిగారు. కోర్టు తీర్పును శిరసావహించి, ఆలయంలోకి వెళ్లే మహిళలకు భద్రత కల్పించినందుకు కేరళలోని పినరయి విజయన్‌(ఎల్‌డీఎఫ్‌) ‌ప్రభుత్వం విమర్శల్నీ ఎదుర్కొంది. నాటి తీర్పుపై పునస్సక్ష కోరుతూ దాఖలైన 64 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తాజాగా గురువారం ఉదయం తీర్పు వెలువరించింది.
విస్తృత ధర్మాసనానికి ‘శబరిమల’..ఇంకా చర్చ జరగాలి
శబరిమల  సుప్రీమ్‌కోర్టు ఇచ్చిన తీర్పును పునఃస క్షించాలని దాఖలైన పిటీషన్లను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. కాగా ఈ తీర్పును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపైఆంక్షలు ఎత్తివేస్తూ 2018 సెప్టెంబరు 28న నలుగురుతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సక్షించాలని కోరుతూ
ట్రావెన్‌కోర్‌ ‌దేవసోం బోర్డు, నాయర్‌ ‌సర్వీసెస్‌ ‌సొసైటీ, దేవస్థాన తంత్రులు, పలువురు భక్తులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కేరళ ప్రభుత్వం కూడా పిటిషన్‌ ‌వేసింది. పలువురు దాఖలు చేసిన దాదాపు 65పిటిషన్లపై గురువారం సుప్రీమ్‌కోర్టు కీలక తీర్పు వెలువరిచింది. దేశంలోని ప్రతిఒక్కరికి మతస్వేచ్ఛ ఉందని తీర్పు సందర్భంగా సీజేఐ రంజన్‌ ‌గొగొయ్‌ ‌తెలిపారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఒకే మతంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ప్రార్థనా స్థలాలలో మహిళల ప్రవేశం ఈ ఆలయానికి మాత్రమే పరిమితం కాదని, మసీదులలోకి మహిళల ప్రవేశం కూడా ఇందులో ఉందన్నారు. తీర్పుపై ధర్మాసనంలోని ఐదుగురు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, శబరిమలపై ఇంకా మరింత చర్చ జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో టెంపుల్‌లో అన్ని వయసుల మహిళలను ప్రవేశపెట్టడానికి అనుమతించే తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన సక్ష పిటిషన్లను 3.2 మెజార్టీతో ఏడుగురు సభ్యుల విసృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు  ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం పిటిషన్లు పెండింగ్‌లో ఉంటాయని, విస్తృత ధర్మాసనం తదుపరి విచారణ చేపడుతుందని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బెంచీలో జడ్జిలు నారిమన్‌, ‌చంద్రచూడ్‌ ‌బదిలీ చేయడాన్ని విభేదించారు. మెజార్టీ తీర్పుతో మత విశ్వాసాలను తక్కువ చేయడం తగదని జస్టిస్‌ ‌నారిమన్‌ అన్నారు.
రాహుల్‌ ‌కాస్త జాగ్రత్తగా మాట్లాడండి
కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీకి ఊరట లభించింది. రఫేల్‌ ‌వ్యవహారంపై స్పందిస్తూ..ప్రధాని మోదీని ’చౌకీదార్‌ ‌చోర్‌ ‌హై’ అంటూ రాహుల్‌ ‌విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత నాక్షి రాహుల్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీమ్‌ ‌రాహుల్‌ ‌గాంధీని సున్నితంగా హెచ్చరించింది. ‘మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించింది. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీమ్‌ ‌వ్యాఖ్యలకు రాహుల్‌ ‌క్షమాపణలు చెప్పారు. ఆయన క్షమాపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం వాదనలను ముగించింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy