వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రక్షా బంధన్‌ ‌రోజున.. వృక్షా బంధన్‌!

August 13, 2019

ఫోటో: భద్రకాళి బండ్‌ ‌గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ..వరంగల్‌లో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు పర్యటన
ఫోటో: భద్రకాళి బండ్‌ ‌గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ..వరంగల్‌లో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు పర్యటన

‌ప్రభుత్వ పాఠశాలల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అదేశాలతో ముందుకు
అక్క అన్న, చెల్లె తమ్ముల ఆత్మీయ బంధాన్ని పంచుకునేది రక్షాబంధన్‌. ‌మనకు వృక్షాలకు ఉండే ఆక్సిజన్‌, ఆరోగ్య బందం అని … మానవ మనుగడకు వృక్షమే రక్ష..వృక్షో.. రక్షితి.. రక్షిత అని అంటాం… ఆ నినాదాన్ని స్ఫూర్తి గా తీసుకొని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు చాటి చెప్పారు. ఇరుకోడ్‌ ‌మోడల్‌ ‌స్కూల్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌ప్రతి ఏటా ఆదర్శ పాఠశాలలో వృక్షా బంధన్‌ ‌నిర్వహిస్తాము అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్‌ ‌రావుకి ప్రిన్సిపాల్‌ ‌వాట్సప్‌ ‌ద్వారా సందేశాన్ని పంపారు. ప్రిన్సిపాల్‌ని ప్రశంసిస్తూ…అదే స్ఫూర్తితో అన్ని పాఠశాలలో వృక్షా బంధన్‌ ‌నిర్వహించాలని ప్రజాప్రతినిధులకు, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.. ఈ మేరకు జిల్లాలో అన్ని పాఠశాలలో ఆగస్ట్ 15‌న రక్షా బంధన్‌ ‌సందర్భంగా వృక్షా బంధన్‌ ‌కార్యక్రమం చేయాలి అని మండల విద్యా శాఖ అధికారులను, పాఠశాలల హెడ్‌ ‌మాస్టర్స్‌ని ఆదేశిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొరారు.
మన బంధాలు ఎంత ముఖ్యమో ..
‘‘ప్రతి ఒక్కరు పుట్టిన రోజున… వివాహ దినోత్సవం సందర్భంగా.. ఎదో మంచి కార్యక్రమం నిర్వహించే సందర్భంలో గుర్తు గా ఒక మొక్క నాటాలి అని హరిశ్‌ ‌రావు ఇచ్చిన స్పూర్తితో ఒక బంధాన్ని పంచుకోనే రోజున గుర్తుగా మొక్క నాటాలి అని వాటిని సంరక్షణ చేయాలి అనే స్ఫూర్తితో వృక్షా బందన్‌ అనే నూతన ఒరవడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఆత్మీయ బంధాన్ని పంచుకొనే రోజున ఒక మొక్క నాటి… మొక్కకు రాఖీ కట్టి మానవ మనుగడకు రక్షణ ఇచ్చే వృక్షము అని చాటి చెప్పాలి అనే హరిశ్‌ ‌రావు స్ఫూర్తికి మరో నిదర్శనం వృక్షా బంధన్‌..’’