Take a fresh look at your lifestyle.

యూరేనియం వ్యతిరేక ఉద్యమం ఉధృతం

దేవరకొండలో సర్వే కోసం వొచ్చిన జియాలజిస్టులను అడ్డుకున్న విద్యావంతుల వేదిక, విద్యార్థి సంఘాలు
యురేనియం తవ్వకాలను అంగీకరించమని నిరసన
యురేనియం తవ్వకాలకు సంబంధించి యురేనియం నమునాలను సేకరించడానికి యుసిఐఎల్‌ ‌సంస్థ(యురేనియం కార్పొరేషన్‌ ఆప్‌ ఇం‌డియా) వేయబోయే బోర్‌ ‌పాయింట్లను గుర్తించడానికి సోమవారం రాత్రి 8 గంటలకు జియోలాజికల్‌ ‌సర్వే ఆప్‌ ఇం‌డియా పేరుతో ప్రత్యేక బస్‌ ‌ద్వారా సుమారు 30 ముంది జియాలాజిస్ట్‌లు(వారికి తెలుగురాదు) దేవరకొండలోని విష్ణు ప్రియ లాడ్జ్‌కు చేరుకోగా విషయం తెలుసుకున్న తెలంగాణ విద్యావంతుల వేదికకు రాత్రి 10 గంటలకు సమాచారం అందిన వెంటనే విద్యావంతుల వేదిక జిల్లా కమిటి స్పందించి దేవరకొండ ప్రాంతానికి చెందిన విద్యావంతుల వేదిక బృందానికి, దళిత యువజన జేఏసి, విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం 6 గంటలకే వారు లాడ్జ్ ‌ముంధు బైటాయించి గో బ్యాక్‌ ‌యుసిఐఎల్‌ అదికారులారా, నశించాలి నల్లమల్లపై యురేనియం సంస్థ ఆధిపత్యం అని నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి వచ్చిన వ్యక్తులు యురేనియంకు సంబంధించిన వాళ్లు కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. వారు జియోలాజికల్‌ ‌సర్వే వారని, భారత ప్రభుత్వంకు సంబంధించిన వారని, వేరే సర్వే కోసం వచ్చారని పోలీసులు ఉద్యమకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ప్లకారుడులతో నిరసన తెలుపుతున్న విద్యావంతుల వేదిక ఎంతకు వినిపించుకోక పోవడంతో పోలీసులు జియాలాజిస్ట్‌లు బస చేసిన హోటల్‌లో వారితో మంతనాలు జరిపారు. ఇరువై నిమిషాల చర్చల అనంతరం పోలీసులు, జియాలాజికల్‌ ‌సర్వే వారు బస్సు ఎక్కుండగా ఉద్యమ నాయకులు వారికి అడ్డుపడి ఎందుకు వచ్చిండ్రు.. ఎంధుకు పోతున్నరని ప్రశ్నిస్తూ సమాదానం చెప్పాలని డిమాండ్‌ ‌చేసినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. విద్యావంతుల వేదిక ప్రతినిధులు బస్సు ముందు బైటాయించడంతో చివరికి మేము జియాలాజిస్ట్ ‌లము ప్రయోగాలు చేయడానికి వచ్చామని ఒక పత్రం ఇచ్చారు. స్పందించిన నాయకులు యురేనియం పేరుతో ప్రయోగాలకు, పరిశోధనలకు నల్లమల్ల, దేవరకొండలో తావులేదని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్‌ ‌చేసారు. కొద్దిసేపు,జియాలాజికల్‌ ‌సర్వే ఆప్‌ ఇం‌డియా వారికి, విద్యావంతుల వేదిక బృందానికి వాదులాట జరుగుచుండగా పోలీసులు జోక్యం చేసుకొని నాయకులను పక్కకు తప్పించి అధికారులను అక్కడి నుంచి పంపించారు. అనంతరం అధికారుల బస్సు హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు.. ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక బాధ్యులు ఎర్ర క్రిష్ణ జాంభవన్‌ ‌మాట్లాడుతూ•- నల్లమల్ల లో యురేనియం పేరుతో ఏలాంటి సర్వేలు, పరిశోధనలు జరుపడానికి వీలు లేదన్నారు. అన్యాయంగా ఆ ప్రాంతం పై ఆధిపత్యం చేసి యురేనియం తవ్వకాలు జరపాలని చూస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమని ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటున్న గిరిజన ఆదివాసి జీవితాలను బుగ్గి పాలు చేయోద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అనేక ఉద్యమాలకు పురుడు పోసిన గడ్డపై అణు విధ్వంసానికి చోటు లేదన్నారు. అక్కడి ప్రజలతో మమేకమై యురేనియం వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకపోతామన్నారు. ఈ అందోళన కార్యక్రమంలో నాయకులు కొర్ర రాంసింగ్‌, ‌లక్ష్మణ్‌ ‌నాయక్‌, ‌వలమల్ల ఆంజనేయులు,ఎస్‌.‌శ్రీనివాస్‌, ‌కట్రావత్‌ ‌రాజు, పొట్ట ప్రభు, ఎర్ర నగేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.నల్లమల్లపై ప్రయోగాలను సహించం : జిల్లా అధ్యక్షులు పందుల సైదులు
విష ప్రయోగాలకు నల్లమల్ల అటవి ప్రాంతంలో చోటులేదని, యురేనియం పేరుతో విధ్వంసక అభివృద్ధి అవసరం లేదని విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు. మానవాళిని, జీవ కోటి ప్రాణాలను హరించే అభివృద్ధి ఏమి అభివృద్ధో పాలకులు స్పష్టం చేయాలన్నారు. అభివృద్ధి ప్రజల కోణంలో జరగాలే తప్ప కార్పొరేట్‌ ‌శక్తులకు ఊడిగం చేసే కోణంలో కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వ్వాల్సిన బాధ్యత పాలకులకు వుందన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy