వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

యూపిలో ఉప్పూ కారం లేని మధ్యాహ్న భోజనం

September 19, 2019

ఉప్పు రోట్టె భోజనం పిల్లల పట్ల అక్కడి ప్రభుత్వం అశ్రద్ధకు అద్దం పడుతోంది. అలాగే, విద్య పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.
దేశంలో ఇలాంటి పాఠశాలలు, ఇలాంటి పరిస్థితులు దాదాపు అన్ని చోట్లా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ పాఠశాలలు ప్రైవేటు రంగానికి చెందినవే. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ప్రభుత్వం వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి అమలు జేస్తున్న పథకాలన్నీ మొక్కుబడిగా సాగుతున్నాయి. పాలనా యంత్రాంగాలు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు.
పిల్లలకు పౌష్టికాహార లోపం జరగకుండా చూసేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరకొడుతుంటాయి. కానీ, వాస్తవంగా జరిగేది వేరు. ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించబడుతోందన్న వార్తలు తరచూ వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని షియూర్‌ ‌ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉప్పూ కారం లేని ఆహారం పిల్లలకు సరఫరా చేయడం. ఈ స్కూలులో మధ్నాహ్న భోజన పథకం ఎంత అధ్వాన్నంగా ఉందో జాతీయ మీడియాలో వచ్చిన కథనాలే నిదర్శనం. ఈ స్కూలులో పరిస్థితి గురించి మీడియాకు తెలియజేసిన విజిల్‌ ‌బ్లోయర్‌ను అరెస్టు చేశారు. జర్నలిస్టు పవన్‌ ‌జైస్వాల్‌పై నేరాభియోగాలు నమోదు చేశారు. ఆయన చేసిన తప్పేమీ లేదు, ఈ స్కూలులో పిల్లలకు పెడుతున్న ఆహారం గురించి విడియో తీయడం. అది ఆయన వృత్తి ధర్మం కాగా, దాన్నో నేరంగా పరిగణించి అధికారులు కేసు పెట్టారు. ఆ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట మనిషికి జీతం ఆపేశారు. స్కూలు టీచర్లను సస్పెండ్‌ ‌చేశారు. బ్లాక్‌ ‌విద్యా శాఖాధికారులను కూడా. ఈ స్కూలులో పరిస్థితి అసమర్ధతకూ, అవినీతికి అద్దం పడుతోంది. ఈ పాఠశాల విద్యార్థులకు ఇలాంటి మధ్యాహ్న భోజనాన్ని పెట్టడం ఇది కొత్త కాదు, వాళ్ళకి అది నిత్యం లభిస్తున్న ఆహారం. బహుశా దేశంలో ఇలాంటి పాఠశాలలు ఇంకా చాలా ఉండి ఉండవచ్చు. ఆర్థిక వ్యత్యాసాలు, పౌష్టికాహా లోపం వల్ల పిల్లల్లో శారీరక బలహీనతలు అన్ని చోట్లా ఒకే రీతిలో ఉన్నట్టు కనిపిస్తోంది. మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు జేసే పథకాల్లో ముఖ్యమైనది. ఈ పథకానికి అయ్యే వ్యయంలో అత్యధిక భాగాన్ని కేంద్రమే భరిస్తోంది. పేద రాష్ట్రాలకు ఈ పథకం కింద ఎక్కువ నిధులు బదిలీ చేస్తుంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడల్లా నిధులు పెంచుతూ ఉంటుంది. అయితే, అవినీతి అసమర్ధత వల్ల ఈ పథకం ఆశించిన రీతిలో ఫలితాలను ఇవ్వడం లేదన్న ఫిర్యాదులు సర్వత్రా వస్తున్నాయి. ఏ రాష్ట్రానికైనా ఈ పథకం అమలు తీరుతెన్నులే నిర్వహణ సామర్థ్యానికి గీటు రాయి అవుతుంది. పిల్లల సంఖ్య పెరిగినప్పుడల్లా సౌకర్యాలు పెంచాలి. చాలా చోట్ల అది జరగడం లేదు. ఇందుకు షియోర్‌ ‌స్కూర్‌ ఉదాహరణ. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అనే సామెత చందంగా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో వారికి పెట్టే ఆహారం నాసిరకంగా ఉంటోంది. ఈ స్కూలులో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకూ విద్యార్థుల సంఖ్య 95. ఈ స్కూలులో ముగ్గురు పూర్తి కాలపు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిష్పత్తి క్రమాన్ని ఏ రాష్ట్రంలోను ఏ పాఠశాలలోనూ పాటించడం లేదు. 2017 వరకూ ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు. శిక్షా కర్మి పేరిట కాంట్రాక్ట్ ‌టీచర్‌ ‌మరొకరు ఉండేవారు. ఆ తర్వాత మూడో ఉపాధ్యాయుడు వచ్చారు. ఆ ఉపాధ్యాయుడిని టీచర్‌ ఇన్‌ ‌చార్జిగా లేదా హెడ్‌టీచర్‌ , ‌హెడ్‌ ‌మాస్టర్‌ ఇన్‌ ‌చార్జిగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఆ పదవిలో మురారీ లాల్‌ ఉన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన దినుసులను సమకూర్చాల్సిన బాధ్యత ఆయనదేని కుక్‌ ‌చెప్పాడు. అతడి వాంగ్మూలం ఆధారంగా మురారీ లాల్‌ను సస్పెండ్‌ ‌చేశారు. 2017 నుంచి శాశ్వత ఉపాధ్యాయురాలిగా ఉన్న రాధాదేవిని కూడా సస్పెండ్‌ ‌చేశారు. దాంతో ఈ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థులు 95 మందికి ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం షియూర్‌లో అక్షరాస్యత 32 శాతం.,
దేశంలో ఇలాంటి పాఠశాలలు, ఇలాంటి పరిస్థితులు దాదాపు అన్ని చోట్లా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ పాఠశాలలు ప్రైవేటు రంగానికి చెందినవే. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ప్రభుత్వం వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి అమలు జేస్తున్న పథకాలన్నీ మొక్కుబడిగా సాగుతున్నాయి. పాలనా యంత్రాంగాలు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు. అయితే, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయినులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్తే, ఉత్తమ ఉపాధ్యాయునులంటూ వ్యాఖ్యానించారు. అంటే ప్రభుత్వం దృష్టికి పాఠశాలల పరిస్థితి వచ్చినప్పటికీ చర్యలు శూన్యం. మధ్యాహ్న భోజన పథకం వల్ల పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెరిగి ఉండవచ్చు. పిల్లలు చదువుకునే పరిస్థితులను కల్పించలేకపోతోంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పిల్లలకు తగిన ఆహారాన్నీ, విద్యను అందించలేకపోతున్నాయి.
– ‘స్క్రోల్‌.ఇన్‌’ ‌సౌజన్యంతో..