వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

యురేనియం మైనింగ్‌ ‌సమస్యలపై డాక్యుమెంటరీ సినిమా

August 1, 2019

‘‘నబికేయి (పాద ముద్రలు)’’
ప్రదర్శన తదనంతరం చర్చ
అందరికీ ఆహ్వానంతేదీ : 3 ఆగస్ట్ 2019
‌సమయం : మధ్యాన్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు
వేదిక : షోయబ్‌ ‌హాల్‌, ‌సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌ ‌లింగంపల్లి, హైదరాబాద్‌.
‌నబికేయి
(ఫుట్‌ ‌ప్రింట్‌)
‌డాక్యుమెంటరీ చిత్రం
శ్రీ ప్రకాష్‌, 2017, 67 ‌నిమిషాలు
అమెరికా నైరుతి ప్రాంతంలోని సార్వభౌమత్వం గల ఆదివాసీ జాతుల ప్రాంతాలైన ఆకోమా, లాగున, డినే ఆర్‌ ‌నవజో దేశాలకు సుదీర్ఘ కాల యురేనియం మైనింగ్‌ ‌చరిత్ర వుంది. ఒకప్పుడు వికసించిన సమృద్ధిగల ఆర్థికవ్యవస్థ కలిగి వుండి యురేనియం రాజధానిగా పేరుగాంచిన ఈ రెడ్‌ ఇం‌డియన్‌ ‌ప్రాంతాలు, పేద తెల్లజాతి సమూహ ప్రాంతాలు ఇప్పుడు చిందరవందరగా వున్న పాత యురేనియం గనులు, టైలింగ్‌ ‌డ్యాంలు ఇతర యురేనియం కాలుష్యాలతో నిండి వున్నాయి. అవన్నీ మరణావస్థలో వున్న పరిశ్రమ అవశేషాల వారసత్వం. ఒక్క నవజో ప్రాంతంలోనే 500 కంటే ఎక్కువ వదిలేసిన యురేనియం గనులున్నాయి, వాటి సమస్యను ఇప్పటికీ పరిష్కరించవలసే వుంది.
అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశుభ్ర గాలి చట్టం, రక్షిత తాగు నీటి చట్టం, రేడియోధార్మికత నష్టపరిహార చట్టం అమలులో ఉన్నప్పటికీ, అక్కడ కఠినంగా, శక్తివంతంగా వ్యవహరిస్తాయని చెప్పుకునే న్యూక్లియర్‌ ‌నియంత్రణ కమిషన్‌, ‌యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌పర్యావరణ సంరక్షక ఏజెన్సీలు ఉన్నప్పటికీ అవి అణు పరిశ్రమ వదిలేసిన కాలుష్యాన్ని తగ్గించటంలో దాదాపు నిస్సహాయంగా మారాయి. అమెరికాలోని ఈ నైరుతి ప్రాంతాన్ని స్పెయిన్‌ ఆ‌క్రమించిన తర్వాత ఈప్రాంతానికి వచ్చిన వలస వాదం ఖనిజ వనరులను వెలికి తీసే కొత్త దాహంతో అక్కడి ముఖ చిత్రాన్ని ఆధునిక కాలంలో ఏవిధంగా మార్చివేసిందో ఈ సినిమా చూపిస్తుంది. స్పెయిన్‌ ఈ ‌ప్రాంతాలను తన వలసలుగా మార్చుకుని భూమి, నీరు, గాలిని కలుషితం చేసింది, ఫలితంగా అక్కడి పేద ప్రజలు దానికి బలై నిస్సహాయులుగా మారారు. న్యాయం కోసం వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొత్త మైనింగ్‌ ‌కంపెనీలు అక్కడి ప్రజల ఆరోగ్యం, పర్యావరణాలను పట్టించుకోకుండా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, ఉద్యోగాలు వస్తాయని ఆశపెట్టి కొత్తరకం లీచ్‌ ‌యురేనియం మైనింగ్‌ ‌పద్దతులను ప్రవేశపెట్టడంతో పేదరికంలో వున్న స్థానిక సమూహాలు దీనికి అత్యధికంగా బంధింపబడ్డాయి.
దురదృష్టవశాత్తు ఇదే విధమైన విషాద గాథ భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా జరిగింది. అయితే భారతదేశంలో ప్రభుత్వమే స్వయంగా ఈ మైనింగ్‌ ‌పరిశ్రమను చేపట్టింది, జార్ఖండ్‌లోని జాదుగూడలో అదే వినాశనాన్ని మళ్ళీ మళ్ళీ కొనసాగిస్తున్నది.