Take a fresh look at your lifestyle.

యురేనియం తవ్వకాలపై పోరాటం సాగిస్తాం

నల్లమల లూటీని అడ్డుకుంటాం : ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌ ‌రెడ్డిప్రకృతి అందాలకు నెలవైన, దట్టమైన అటవీ సంపద కలిగిన నల్లమలను లూటీ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఈ కుట్రలను అడ్డుకొని తీరుతామని, అందుకోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏఐసీసీ కార్యదిర్శి వంశీచందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో నాగర్‌కర్నూల్‌ ‌డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ ‌చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తెంలగాణకు ఊటీ లాంటి నల్లమల ప్రాంతాన్ని పాలకులు లూటీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో తామంతా ఉద్యమిస్తే తవ్వకాలు నిర్ణయంపై వెనక్కు తగ్గారని, కానీ కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయని మళ్లీ తవ్వకాలు మొదలు పెట్టాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ’నల్లమల టైగర్‌ ‌రిజర్వు ఫారెస్టు. చెంచులు, ఆదివాసీలు బతుకుతున్న ప్రాంతం. ఇక్కడ తవ్వకాలను మేం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామని, బహుళ జాతి కంపెనీలకు కోట్ల రూపాయలు కట్టబెట్టడానికి ఇక్కడి ప్రజలను, అటవీ సంపదను బలి చేస్తారా అంటూ ప్రశ్నించారు. విదేశాల్లో, కడపలో కూడా యురేనియం తవ్వకాలను ఆపేశారని, యురేనియం తవ్వకాల వల్ల పుట్టబోయే బిడ్డలకు కూడా అంగవైకల్యం ఏర్పడుతుందని, ప్రకృతి పూర్తిగా నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం నదీ జలాలు కలుషితం అవుతాయని, నాగార్జునసాగర్‌ ‌నీరు తాగే హైదరాబాద్‌ ‌ప్రజలపై కూడా ఈ ప్రభావం పడనుందన్నారు. గతంలో కేసీఆర్‌ ‌కూతురు, మాజీ ఎంపీ కవిత యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటాలు చేస్తామని, ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, తవ్వకాల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా ఉద్యమం ఆగదని హెచ్చరించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!