వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

యురేనియం తవ్వకాలపై .. త్వరలో అఖిలపక్ష భేటీ

September 9, 2019


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వొత్తిడి తెస్తాం
కలిసిరావాలని పవన్‌ ‌కళ్యాణ్‌ను కోరా
పోరాటానికి మద్దతు తెలిపాడు
జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌తో వీహెచ్‌ ‌సమావేశం
తెలంగాణ కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత వీ హనుమంతరావు (వీహెచ్‌) ‌జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ను కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ఆఫీసులో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఇద్దరు దాదాపు అరగంటకుపైగా చర్చలు జరిపారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై వీహెచ్‌ ‌జనసేనానితో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలపైనా ఇద్దరి మధ్య ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. నల్లమలలో యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ వ్యవహారంపై చర్చించేందుకు వీహెచ్‌ ‌పవన్‌ ‌కళ్యాణ్‌ను కలిశారు. శ్రీశైలం, నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలతో.. పర్యావరణం, అక్కడ నివసించే చెంచుల జీవనాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది తనను కలిసి చెప్పారన్నారు. రెండు మూడు రోజుల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్‌, ‌కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.. కాబట్టి దీనిపై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని, అన్ని పార్టీలతో, పర్యావరణ శాస్త్రవేత్తలతో మాట్లాడి.. ఓ అవగాహన సదస్సును
కూడా ఏర్పాటు చేస్తామని వీహెచ్‌ అన్నారు. యురేనియం తవ్వకాలతో వచ్చే సమస్యల్ని వివరించబోతున్నామని, పవన్‌ ‌కళ్యాణ్‌ ఇలాంటి సమస్యలపై ప్రజల్లోకి వెళ్లగలుగుతారనే ఉద్దేశంతో ఆయన్ను కలిసినట్లు వీహెచ్‌ ‌చెప్పారు. యురేనియం తెలంగాణతో పాటూ నల్లమల్ల ప్రాంతంలో తవ్వకాలు చేపడితే కృష్ణా నదిలో నీళ్లు కలుషితమవుతాయని, ఆ నీటిని హైదరాబాద్‌, ‌మహబూబ్‌ ‌నగర్‌, ‌నల్గొండ, ప్రకాశం, కృష్ణా ప్రాంతాల వాళ్లు తాగుతారన్నారన్నారు. ఈనీళ్లు తాగితే అందరూ అనారోగ్యం పాలవుతారని.. పొలాల్లో పంటలు కూడా పండవన్నారు. అందుకే పవన్‌ ‌కళ్యాణ్‌ను కలిశామని, ఆయన కూడా సానకూలంగా స్పందించారన్నారు. అందరం కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.