వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం : కోమటిరెడ్డి

September 13, 2019

ప్రాణాలైనా అర్పించి యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు.యురేనియం తవ్వకాలతో సర్వనాశనం కావడం అవసరమా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి, ప్రకృతి విధ్వంసానికి ఒడిగట్టే చర్యలను అడ్డుకుని తీరుతామని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. రైతులను మోసం చేసి కేసీఆర్‌ ఎన్నికల్లో గెలిచారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుందని, ప్రాజెక్టుల పేరుతో మూడు లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టిందని, అధినేత తీరును ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి నాయిని లాంటి నేతనే మోసం చేశాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని ఎంపీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అధినేత తీరును వ్యతిరేకిస్తున్నవారిని తెలంగాణ భవన్‌కు పిలిచి కాళ్లు పట్టుకుని పార్టీలో ఉంచుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి విమర్శించారు. అయినా అసమ్మతి భగ్గుమనక తప్పదన్నారు.