వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

యురేనియం కొనగలం..అడవులను కొనగలామా?

September 12, 2019

‘సేవ్‌ ‌నల్లమల’కు మద్దతుగా సినీహీరో విజయ్‌ ‌దేవరకొండ ట్వీట్‌‌నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయం తెలుగు రాష్టాల్ల్రో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షాల నాయకులతోపాటు పర్యావరణవేత్తలు, సినీ నటులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. జీవవైవిధ్యం నాశనమవుతుందని ఆవేదన చెందుతున్నారు. యురేనియం తవ్వకాలతో క్యాన్సర్‌, ‌మూత్రపిండ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తాజాగా సినీ నటుడు విజయ్‌ ‌దేవరకొండ కూడా యురేనియం తవ్వకాలపై స్పందించారు. సేవ్‌ ‌నల్లమల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ గురువారం ఓ ట్వీట్‌ ‌చేశారు. 20వేల ఎకరాల్లో ఉన్న నల్లమల అడవి యురేనియం తవ్వకాలతో నాశనం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే మనం నదులను కలుషితం చేశామని, కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తుతుంటే.. కొన్ని నగరాలు నీరు దొరకక అల్లాడుతున్నాయి. మంచినీటి వనరులు కూడా పూర్తిగా కాలుష్యం బారిన పడుతున్నాయి. అన్నిచోట్లా మనం పీల్చే గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోందన్నారు. ఒకదాని తర్వాత ఒకటి వనరులను అన్నింటినీ నాశనం చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఇప్పుడు పచ్చని నల్లమల అడవులపైనా మన కన్ను పడిందని, యురేనియం లాంటి పునరుత్పత్తి లేని వనరుల కోసం అడవులను నాశనం చేసుకుంటామా అంటూ విజయ్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. అవసరమైతే యురేనియం కొనుక్కోవచ్చు, కానీ అడవులను కొనగలమా..అంటూ ట్విట్టర్‌ ‌వేదికగా ప్రశ్నించారు. అవసరమైతే సోలార్‌ ఎనర్జీని వినియోగంలోకి తీసుకొద్దామని, ప్రతి ఇంటిపై కప్పు ద సోలార్‌ ‌ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని తప్పనిసరి చేద్దాం అంటూ పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు లేనప్పుడు యురేనియంను, ఎలక్ట్రిటీని ఏం చేసుకుంటాం..? మిగిలిన కొద్దిపాటి వనరులను కూడా నాశనం చేసి ఏం సాధిస్తామని ప్రశ్నించారు. నల్లమలను కాపాడుకుందాం అంటూ విజయ్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. విజయ్‌ ‌చేసిన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌పై మద్దతుగా రీట్వీట్‌లు చేస్తున్నారు.