Take a fresh look at your lifestyle.

యుపిపిఎస్‌సి ప్రిమిలరీ పరీక్షలకు ఏర్పాట్లు: కలెక్టర్‌

అక్టోబర్‌ ‌నెల 4న జరిగే యూనియన్‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌యుపియస్‌సి) ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్‌ ‌సర్వీస్‌ ‌ప్రిమిలరి పరీక్షలు 2020 కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు వెల్లడించారు. శుక్రవారం ఉదయం యుపిపియస్‌సి సివిల్‌ ‌సర్వీస్‌ 2020 ‌పరీక్షల నిర్వహణ మార్గదర్శ కాలు సమర్థ ఏర్పాట్ల పై యుపిపియస్‌సి సెక్రెటరీ వసుధ మిశ్రా న్యూ ఢిల్లీ నుండి  కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగాకలెక్టర్‌ ‌మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పరీక్ష కేంద్రాల్లో 6763 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సూపర్‌ ‌వైజర్‌ అధికారిని నియమించామని, పరీక్ష కేంద్రం వద్ద సానిటైజర్‌, ‌ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు, ప్రశ్న పత్రాలు పరీక్షల కేంద్రం వద్ద బందోబస్తు చర్యలుతీసుకున్నట్లు తెలిపారు.

యుపిపియస్‌సి సెక్రటరి వసుధ మిశ్రా మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండ పటిష్ట మైన ఏర్పాటు చేయాలని ఈ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా 72 కేంద్రాల్లో 2569 వెన్యులలో ఏర్పాటు చేయగా 10.58లక్షల మంది పరీక్షలకు హాజరు కానున్నారని వివరించారు. పరీక్ష సమయానికి 10నిముషాలు ముందే కేంద్రం మూసేసి ఉంచాలని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ అడ్మిన్‌ ‌కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు తీసుక రావాలని, ఈ అడ్మిన్‌ ‌కార్డు, ఐడి కార్డు మిస్‌ ‌మ్యాచ్‌కావద్దని సూచించారు. కొవిద్‌ ‌నిబం ధనలు పాటించాలని,పరీక్ష కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఉండకూడదని, భౌతిక దూరంపాటించాలని అభ్యర్థులే తప్పనిసారి గా మస్కు, సానిటైజార్‌ ‌తెచ్చుకోవాలి అన్నారు. అక్టోబర్‌ 4 ‌న మొదటి పేపర్‌ ఉదయం9.30 నుండి11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 4.30గంటల వరకు నిర్వహించబడిన పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఎలాంటి ఎలాక్ట్రానిక్‌ ‌పరికరాలు తీసుకరావద్ద న్నారు.ఈవీడియో కాన్ఫరెన్స్ ‌లో జిల్లా కలెక్టర్‌,‌డిసిపి పుష్ప, ఆర్డీవో వాసు చంద్ర, డిఅర్‌డిఓ శ్రీనివాస్‌ ‌కుమార్‌లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!