వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మోడీ బడా బాబుల దోస్త్ ..!

April 5, 2019

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌ ‌గాంధీ
మోదీ తన ఐదేళ్ల పాలనలో బడా వ్యాపారవేత్తలకే సలాం కొట్టాడని, పేద ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో విఫలమయ్యాడని కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యలో మహారాష్ట్రలోని పుణెలో విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ ‌మాట్లాడుతూ.. ’ఐ లవ్‌ ‌నరేంద్ర మోదీ.. నాకు ఆయనపై ఎటువంటి ఆగ్రహం, ద్వేషం లేదని వ్యాఖ్యానించారు. ’నేను సత్యం ఆధారంగా పనిచేస్తానని, దాని నుంచే మానవత్వం పుట్టుకొస్తుందని, మానవత్వం నుంచే ధైర్యం వస్తుందని, బలహీనవర్గాలైన రైతుల తరఫున నేను నిలబడతానన్నారు. కనీస ఆదాయ భరోసా పథకంలో భాగంగా పేదవారికి ఏడాదికి రూ.72,000 ఇస్తామంటూ మేము ఇచ్చిన హాని నెరవేర్చుతామన్నారు. ప్రతిరోజు భారత్‌ 27,000 ఉద్యోగాలు రాకుండా కోల్పోతోందని రాహుల్‌ ‌తెలిపారు. అనిల్‌ అం‌బానీ, మెహుల్‌ ‌చోక్సీ వంటి వారి ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, వారు దేశంలోని యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని, ఇప్పటివరకు ఎంతమంది రుణాలను మాఫీ చేశారని ప్రశ్నించారు.