Take a fresh look at your lifestyle.

మోగిన పంచాయితీ ఎన్నికల నగారా

  • మూడు విడత్లో పంచాయితీ ఎన్నికలు
  • ఈ నెల 21,25,30న మూడు విడతల్లో పోలింగ్‌
  • ఉదయం7 నుంచి 1గంట వరకు పోలింగ్‌
  • సాయంత్ర కౌంటింగ్‌..అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌
  • ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన కమిషనర్‌ నాగిరెడ్డి

హైదరాబాద్‌,జనవరి1): తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నగరా మోగింది. మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను విూడియాకు వెల్లడించారు. ఈ ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. జనవరి 21న మొదటి విడత పోలింగ్‌.. రెండో విడత పోలింగ్‌ జనవరి 25న.. మూడో విడత పోలింగ్‌ జనవరి 30న జీపీ ఎన్నికల ఉంటాయని కమిషనర్‌ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 12,732 గ్రామ పంచాయతీలు.. 1,13,170 వార్డుల్లో ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,13,190 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌ జరుగుతుందని, పోలింగ్‌ రోజే ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని స్పష్టంచేశారు.

తెలంగాణలో గ్రామ పంచాయతీ(జీపీ) ఎన్నికలకు నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి విడుదల చేశారు. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సచివాలయంలో విూడియాకు వివరించారు. తొలి విడతలో 4480 గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. రెండో విడతలో 4137.. మూడో విడతలో 4115 పంచాయతీలకు పోలింగ్‌ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 1,13,190 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు ఉంటాయన్నారు. పోలింగ్‌ సమయం ముగియగానే కౌంటింగ్‌ మొదలు పెడతామని కమిషనర్‌ పేర్కొన్నారు. సర్పంచ్‌ పదవి కోసం పోటీ చేసే జనరల్‌ అభ్యర్థి రూ.2వేలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులు.. జనరల్‌ రూ.500.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250 డిపాజిట్‌ చేయవల్సి ఉంటుంది. 5వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులు 2.5లక్షలు.. వార్డు మెంబర్‌ అభ్యర్థుల ఖర్చు రూ.50వేల వరకు ఖర్చు చేయవచ్చన్నారు. 5వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులు లక్షా యాభైవేలు.. వార్డు మెంబర్‌ అభ్యర్థుల ఖర్చు రూ.30వేలు దాటొద్దన్నారు. తొలుత వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్‌ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అదే రోజు వార్డు మెంబర్లంతా కలిసి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. 19 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఎన్నికలు జరగడం లేదు. 5 గ్రామ పంచాయతీల్లో ఇంకా సమయం ఉంది. వెంటనే ఎన్నికలు కోడ్‌ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. రాష్ట్రంలో 12,571 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో కొత్తగా ఏర్పడిన గిరిజన పంచాయతీల్లో కోలాహలం నెలకొన్నది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy