వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌కేసు

December 7, 2019

వరంగల్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధి సుబేదారి స్టేషన్‌లో నమోదు
తెలంగాణలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌కేసు మోదైంది.వరంగల్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలోని సుబేదారి స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. శాయంపేట పరిధి గోవిందాపూర్‌కు చెందిన 24 ఏళ్ల ఏళ్ల యువతి మిస్సింగ్‌పై సుబేదారి పోలీస్‌ ‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. యువతి చిన్నాన్న పీర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌కేసును నమోదు చేయడంతో సుబేదారి పోలీసులను వరంగల్‌ ‌సీపీ అభినందించారు. వీలైనంత త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా.. ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ సబ్‌డివిజన్‌ ‌పరిధిలో రెండ్రోజుల క్రితం మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదైన విషయం తెలిసిందే. ఎవరైనా బాధితులు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం సప పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ప్రాంతం మా పరిధి కాదు అని పోలీసులు నిరాకరిస్తుంటారు. బాధితులు తమ నివాసం ఏ స్టేషన్‌ ‌పరిధిలోకి వస్తుందో తెలుసుకుని, ఫిర్యాదు చేసేలోపు ఘోరాలు జరిగిపోతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలని గతంలో యూపీ, కర్ణాటక హైకోర్టులు తీర్పులు వెలువరించాయి. దిశ హత్య తర్వాత జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌చర్చకు వచ్చింది. దిశ తల్లిదండ్రులకు కూడా సరిహద్దు సమస్య పేరుతో పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. దిశ కేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్‌ ‌వేటు పడింది. శంషాబాద్‌ ఎస్సై రవికుమార్‌, ‌హెడ్‌కానిస్టేబుళ్లు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌ను సీపీ సజ్జనార్‌ ‌సస్పెండ్‌ ‌చేశారు. ఫిర్యాదు స్వీకరణలో నిర్లక్ష్యం వహించినందుకు పోలీసులపై సీపీ చర్యలు తీసుకున్నారు.