Take a fresh look at your lifestyle.

మేం గొర్రెలం…!

కులాల, మతాల పేరుతో
వోట్లడిగితే గెలిపించేస్తాం
ఎందుకంటే మేం గొర్రెలం

ఉచితాలు, హామీలు
కురిపించేస్తే గద్దెనెక్కించేస్తాం
ఎందుకంటే మేం గొర్రెలం

ఆశలు, భరోసాలు
కల్పించేస్తే పల్లకీలు మోసేస్తాం
ఎందుకంటే మేం గొర్రెలం

మాయ మాటలు, డబ్బు మూటలు
పంచేస్తే అంబారీ పై ఊరేగిస్తాం
ఎందుకంటే మేం గొర్రెలం

విందు ముక్కలు, ముందు చుక్కలు
ఏర్పరిస్తే బానిసలై తలొంచేస్తాం
ఎందుకంటే మేం గొర్రెలం

వేటు వేస్తాడని తెలిసి
కసాయి వాడిని
పోటు పొడుస్తాడని తెలిసి
రాజకీయ నాయకుడినీ
గుడ్డిగా నమ్మేస్తుంటాం
ఎందుకంటే మేం గొర్రెలం

మా నమ్మకాన్ని వమ్ము చేసే
నాయకులున్నంత వరకు
మేం గొర్రెలమే…,, ,!

కయ్యూరు బాలసుబ్రమణ్యం
     9441791239

Leave a Reply