వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మూడోరోజు 10 మృతదేహాలు లభ్యం

September 18, 2019

గోదావరిలో గాలింపు చర్యలు ముమ్మరం
ఇప్పటికీ 38మృతదేహాలు గుర్తింపు
బోటు ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బందిబోటు ప్రమాద ఘటనలో గల్లంతైన మృతదేహాల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతుంది. కాగా బుధవారం మూడోరోజు గాలింపులో భాగంగా 10 మృతదేహాలను వెలికితీశారు. దేవీపట్నం వద్ద ఐదు మృతదేహాలను గుర్తించగా.. కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద మరో మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి లంక వద్దకు 4 మృతదేహాలు కొట్టుకువచ్చాయి. మృతదేహాలను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. పంచనామా నిర్వహించి మృదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ 38 మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం వెలికితీసిన మృతదేహాలలో మహేశ్వర్‌రెడ్డి(నంద్యాల), రాజేందప్రసాద్‌(‌వరంగల్‌ ‌జిల్లా కడిపికొండ), శ్రీనివాసరావు (పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు), తాలిబ్‌ ‌పటేల్‌(‌హైదరాబాద్‌ ‌టౌలీచౌకీ), పెద్దిరెడ్డి దాలమ్మ(విశాఖ జిల్లా గోపాలపురం)లుగా గుర్తించారు. మిగిలిన మృతదేహాల వివరాలను గుర్తించే పనిలో అధికాలరుగు నిమగ్నమయ్యారు. మరోవైపు బోటు ఉన్న ప్రదేశాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది గుర్తించింది. అత్యాధునిక స్కానర్లతో గాలింపు చేపట్టగా.. స్కానింగ్‌లో బోటు ఆనవాళ్లు కనిపించాయి. అయితే బోటుని ఎలా వెలికితీయాలనే దానిపై స్పష్టత లేదు. బోటు 300 అడుగుల లోతులో ఉండటం సమస్యగా మారింది. ప్రమాదానికి గురైన రాయల్‌ ‌వశిష్ట టూరిస్ట్ ‌బోటు 25టన్నుల బరువు ఉంది. బోటు ప్రమాదానికి గురైన ప్రాంతం ప్రమాదకర ప్రాంతం. వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. సుడి గుండాలు అధికంగా ఉన్నాయి. దీంతో వాటన్నింటిని అధిగమించి బోటుని బయటికి తీసుకురావడం ఎలా అని చర్చలు జరుపుతున్నారు.
మునిగిన బోటును గుర్తింపు బయటకు తీయడం అసాధ్యమని వెల్లడి
రాజమండ్రి : పాపి కొండల్లో నీటిలో మునిగి పదుల మందిని బలి తీసుకున్న బోటు జాడ దొరికింది. సోనార్‌ ‌సిస్టమ్‌ ‌ద్వారా 70-80 టర్ల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం బోటు ఎక్కడుందో కనిపెట్టారు. కాగా, ఈ బోటు మునిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 34 మృతదేహాలు వెలికితీశారు. మరో 13 మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. కాగా, గోదావరి నదిలో దాదాపు 315 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు మొదట నేవీ సిబ్బంది చెప్పారు. అంత లోతు నుంచి బోటును తీయడం సాధ్యం కాదని వారు చెతులెత్తేశారు. అయితే తాజాగా బోటు 70-80 టర్ల లోతులోనే ఉన్నట్లు గుర్తించారు.