హరిద్వార్ కుంభమేలా సజావుగా సాగేందుకు చర్యలు
భారత్‌లో వాక్సిన్ డ్రైవ్ మూడవ దశ గురువారం ప్రారంభము అయ్యింది. ఈ దశలో భాగంగా 45 ఏళ్ళు పైబడిన వారు ఇక నుంచి వాక్సిన్‌కి అర్హులు. భారతదేశ కోవిడ్ -19 కేసులలో దాదాపు 80% కేసులు ఆరు రాష్ట్రాలు, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు మరియు గుజరాత్ ల నుంచి ఉన్నాయి. మూడవ దశ కోవిడ్ -19 టీకా డ్రైవ్‌ను గెజిటెడ్ సెలవులతో సహా మిగతా అన్ని రోజులలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కేంద్రాలలో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ టీకాల కవరేజ్ వేగం పెంచడానికి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలోని అన్ని కోవిడ్-19 టీకా కేంద్రాలను ఉపయోగించుకోవాలని మార్చి 31న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించిన తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గురువారం వరకు భారతదేశంలో 6.5 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను ప్రజలకి భారత ప్రభుత్వం అందించింది. ఫ్రంట్‌లైన్ మరియు హెల్త్‌కేర్ వర్కర్లు, వృద్ధులు మరియు దీర్ఘ కాలిగా వ్యాధులు ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చి టీకాకు అర్హులు చేయటం మొదటి దశలో జరిగింది. మార్చి 31 అంటే టీకా డ్రైవ్ యొక్క 75వ రోజు సరికి 20,63,543 టీకా మోతాదులను ప్రభుత్వం అందించింది. అందులో మొత్తంగా టీకా లీసుకున్న వారు 17,94,166 మంది కాగా మొదటి మోతాదును పొందిన 2,69,377 మందికి రెండవ మోతాదును కూడా ప్రభుత్వం అందించింది.
హరిద్వార్ కుంభమేలా సజావుగా సాగేందుకు చర్యలు
కొరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతున్న పరిస్థితిలో గురువారం కుంభ మేలా అధికారికంగా హరిద్వార్‌లో ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ సహా వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి వొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేలా సజావుగా సాగాలని హరిద్వార్ కుంభమేలా ఆఫీసర్ దీపక్ రావత్, సంజయ్ గుంజ్యాల్ మరియు హరిద్వార్ ఎస్‌ఎస్పి జన్మేజయ్ ఖండూరి, గంగా ఒడ్డున ఉన్న దేవాలయాలలో ప్రార్థనలు చేశారు. ఉత్తర ప్రదేశ్ సరిహద్దులకి దగ్గరగా వుండే ఉత్తరాఖండ్ రూర్కీలోని నర్సన్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కాశీపూర్ వద్ద తనిఖీలు తీవ్రతరం చేయబడ్డాయి. ఆర్టీ-పిసిఆర్ పరీక్ష నివేదిక ఉన్న వ్యక్తులు మాత్రమే కుంభమేలాలో పాల్గొనాలని నిర్ధారించారు. పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు, భక్తులు తమతో ఆర్‌టి-పిసిఆర్ పరీక్ష నివేదికను తమతో పాటుగా తీసుకురావడం తప్పనిసరని మేలా అధికారి దీపక్ రావత్ చెప్పారు.