Take a fresh look at your lifestyle.

ముష్కరుల అంతానికి ఐక్యంగా పోరాడాలి – ప్రపంచ దేశాల పిలుపు

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్‌ ‌జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన అమెరికా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భారత్‌తో కలిసి
పోరాడుతామని ప్రకటించింది. ఉగ్రదాడిని అమానవీయ చర్యగా పేర్కొన్న రష్యా ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్, ‌జర్మనీలు ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. ఉగ్రదాడిని హేయమైన చర్యగా అభివర్ణించిన ఆస్టేల్రియా.. ఉగ్రపోరులో భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్‌, శ్రీ‌లంకలు అమరుల కుటుంబాలకు తమ సానుభూతిని ప్రకటించాయి. ఉగ్రదాడిని ఐరాస ప్రధాన కార్యదర్శి తీవ్రంగా ఖండించారు. అమరుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. జై షే మహ్మద్‌ ఉ‌గ్రవాద సంస్థ మసూర్‌ అజార్‌పై భారత్‌ ‌ప్రతిపాదించిన నిషేధానికి ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కోరారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!