Take a fresh look at your lifestyle.

ముగిసిన నాలుగో విడత పోలింగ్‌

‌పోటీలో ప్రముఖ నేతలు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ ‌ముగిసింది. ఇక పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద క్యూలైన్‌లో వేచి ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు వీలుంటుంది. మొత్తం 9 రాష్ట్రాల పరిధిలోని 72 లోక్‌సభ నియోజకవర్గాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు మినహా పోలింగ్‌ ‌ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి బిహార్‌లో 44.33శాతం, జమ్ముకశ్మీర్‌లో 9.37శాతం, ఝార్ఖండ్‌లో 57.13శాతం, మధ్యప్రదేశ్‌లో 57.77 శాతం, మహారాష్ట్రలో 42.52శాతం, ఒడిశాలో 53.61శాతం, రాజస్థాన్‌లో 54.75శాతం, ఉత్తరప్రదేశ్‌లో 45.08శాతం, పశ్చిమబెంగాల్‌లో 66.46శాతం పోలింగ్‌ ‌నమోదైనట్లు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ విడతలో 963 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్‌ ‌నటి ఊర్మిళా మతోండ్కర్‌, ‌సంజయ్‌దత్‌ ‌సోదరి
ప్రియాదత్‌, ‌పూనమ్‌ ‌మహాజన్‌, ‌మిలింద్‌ ‌దేవ్‌రా, మూన్‌మూన్‌ ‌సేన్‌, ‌కేంద్రమంత్రులు గిరిరాజ్‌ ‌సింగ్‌, ‌సుభాష్‌ ‌భామ్రే, ఎస్‌ఎస్‌ అహ్లువాలియా, బాబుల్‌ ‌సుప్రియో తదితరులు నాలుగో దశలో పోటీపడ్డారు. మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌- ‌ఛింద్‌వాడా శాసనసభ (ఉపఎన్నిక) స్థానానికి, ఆయన తనయుడు నకుల్‌నాథ్‌.. ‌ఛింద్‌వాడా లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున బరిలో ఉండడం విశేషం. నాలుగో విడత పోలింగ్‌తో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 373 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ ‌పూర్‌ఖ్తెంది. ఐదో విడత ఎన్నికలు మే 6న జరగనున్నాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!