వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ముఖ్యమంత్రి వొస్తేనేనా… ప్రగతి సింగారం గ్రామం శుభ్రత…?

August 13, 2019

ముఖ్యమంత్రి తెలంగాణలోని పల్లెలు శుభ్రంగా ఉండాలని గత అయిదేళ్లుగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ పల్లెల్లో గ్రామపంచాయతీలో సరిపడ సిబ్బంది లేక పిచ్చి మొక్కలు, చెట్లు, శిథిల భవనాలతో కునారిల్లుతున్న దృశ్యం కనబడుతుంది. ముఖ్యమంత్రి తన పార్టీకి చెందిన ఒక శాసనసభ సభ్యుడి తండ్రి మరణించి నందున పెద్దకర్మ కార్యక్రమం లో పాల్గొనడానికి బుధవారం శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి విచ్చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని జిల్లా పంచాయతీ శాఖ రెండు రోజుల ముందు నుంచే గ్రామంలో చెత్త చెదారం, పిచ్చి మొక్కలు లేకుండా ఉండడానికి తీవ్రంగా శ్రమిస్తున్న ది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రగతి సింగారం గ్రామంలో ఆయన పర్యటన పుణ్యమా అని ఎటువైపు చూసినా పరిశుభ్రత పరిఢవిల్లుతుంది. ఇదంతా ఎలా సాధ్యమైంది. ప్రగతి సింగారం లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడానికి తగినంత సిబ్బంది లేరు. పక్క మండలాల గ్రామ పంచాయతీల నుంచి సిబ్బందిని పిలిపించి మునుపెన్నడూ లేని రీతిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను సోమ మంగళవారాల్లో చేపట్టారు. అయితే మంత్రి పర్యటన సందర్భంగానూ, ఇతర ముఖ్యులు ఎవరైనా వస్తే గాను ఇలా జరిగే అవకాశం లేదు. మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం మొదలు పెట్టినప్పటి ముఖ్యమంత్రి గ్రామాల్లో మౌలిక వసతుల గురించి పదే పదే వల్లె వేస్తున్నారు. గ్రామాలకు 14వ ఆర్థిక సంఘం నిధులు అయితే వస్తున్నాయి గాని గత నాలుగైదు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్‌ ఎఫ్‌ ‌సి మినహా ఏ ఒక్క గ్రాంటు వచ్చింది లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం గ్రామ పంచాయతీలను గాడిన పెట్టాలని గ్రామ పరిపాలన లో కొత్త మార్పులు తీసుకురావాలని ఉద్దేశంతో ప్రతి పంచాయతీ కి ఒక కార్యదర్శి నీ ఇచ్చిన పంచాయతీలో క్షేత్రస్థాయిలో