Take a fresh look at your lifestyle.

మీడియా ప్రజలవైపు నిలబడాలి

ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు:‘ప్రజాతంత్ర’ కూకట్‌పల్లి జోనల్‌ ‌కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రెస్‌కెన్సిల్‌ ‌సభ్యుడు దేవులపల్లి అమర్‌మీడియా సత్యాన్వేషణ చేసి ప్రజలకు నిజాలను తెలపాలని, కాని ప్రస్తుతం మీడియా ఆ పాత్ర పోషించడం లేదని ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా సభ్యులు దేవులపల్లి అమర్‌ అన్నారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక శేరిలింగంపల్లి, కూకట్‌ ‌పల్లి జోన్‌ ‌కార్యాలయాన్ని అమర్‌ ‌ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొన్ని మీడియా సంస్థలు తాము స్వతంత్రులమని, ప్రజల కోసమే నిబడ్డామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చెయ్యాలి తప్ప, వారి బాధ్యతలను కూడా మీడియా సంస్థలు మొయ్యడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కొన్ని మీడియా సంస్థలు ప్రజలకు నిజమైన వార్తలను అందించడం మరిచిపోయి, డబ్బు సంపాదించడం, ఆస్తులను పెంచుకోవడంలో నిమగ్నమయ్యాయని, ప్రస్తుతం మీడియాలో అట్లాంటి వాతావరణం నెలకొన్నదని దుయ్యబట్టారు. వార్తలు రాసి, ప్రజలను ప్రభావితం చేసి, రాజకీయ పార్టీలకు ఊడిగంచేసే విధానం నెలకొన్నదని ఆరోపించారు. మీడియా సంస్థలు బహిరంగంగా ప్రకటించుకుంటే తమకేమి అభ్యంతరం లేదని, స్వతంత్రులమని చెప్పి రాజకీయ పార్టీలను మోస్తున్నారని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ మనకు అవసరంలేదని, ప్రజలు తమకు తాముగా బ్రతికే తెలంగాణ కావాలని కోరారు. ‘ప్రజాతంత్ర’ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీని మొయ్యలేదని, భవిష్యత్తులో కూడా రాజకీయ రంగు అంటించుకోదని స్పష్టం చేశారు. 1998లో సంపూర్ణ స్వతంత్ర వారపత్రికగా ప్రారంభమైందని గత 18 ఏళ్ళుగా దినపత్రికగా కొనసాగుతున్నదని అన్నారు. మలివిడత ఉద్యమాన్ని ఎలిగెత్తి ‘ప్రజాతంత్ర’ చాటిచెప్పిదని, అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించినా, ప్రజాతంత్ర దిన పత్రిక మాత్రం తెలంగాణ నినాదాన్ని ప్రజ్వలింప చేసిందని గుర్తుచేశారు. 1969 ఉద్యమకారుల వారసులుగా ముందుకు వచ్చి పత్రికను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుపుతున్నామని అన్నారు. ప్రజాతంత్ర పత్రిక పూర్తిగా తెలంగాణకు అంకితమై..తెలంగాణలోనే నడుపుతున్నామని, ఇతర ప్రాంతాల్లో ఎలాంటి ఎడిషన్లు లేవన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బిజేపి రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్‌ ‌మాట్లాడుతూ తెలంగాణలో మీడియా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రజలకోసం పనిచేసే సంస్థలు కనిపించడం లేదని, ప్రజాతంత్ర ప్రజకోసం ప్రజల వార్తలను అందజెయ్యాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులు గొట్టిముక్కల వెంగళ్‌ ‌రావు తెలంగాణ ప్రజల గొంతుకగా వున్న ప్రజాతంత్ర పత్రికకు ఎల్లవేళలా అండదండలు అందజేస్తామని అన్నారు. ప్రజాతంత్ర తెలంగాణ దిన పత్రిక ఎడిటర్‌, ‌పబ్లిషర్‌ ‌దేవులపల్లి అజయ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజాకవి నిస్సార్‌, ‌కవి గాయకులు దరువు అంజయ్య, జంగ్‌ ‌ప్రహ్లాద్‌, ‌ప్రయివేట్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, కూకట్‌పల్లి ప్రెస్‌ ‌క్లబ్‌ అద్యక్షులు శ్రీనివాస్‌ ‌రెడ్డి, జప్పు రామస్వామి, మాల మహానాడు నాయకులు వెకటయ్య, ధశరథ్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు నర్సింహాచారి, అనిల్‌ ‌రెడ్డి, ప్రయివేట్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మీడియా సెల్‌ ‌కన్వీనర్‌ ఎ‌ర్ర యాకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌జగదీష్‌ను సన్మానించారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy