Take a fresh look at your lifestyle.

మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పు

తీవ్రమైన వాతావరణ మార్పు ప్రభావం ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తోంది. గడిచిన కొద్ది దశాబ్దాలలో కన్నా ఇప్పుడు మనుషుల్లో అసహన ధోరణులు పెరిగిపోతున్నాయి. ఎవరిని పలకరించినా, సరైన రీతిలో సమాధానం చెప్పకపోవడం, చిరాకు పడటం,  మాట్లాడిన మాటల్లో అర్థం లేకపోవడం వంటి ధోరణులు ఎక్కువ కనిపిస్తున్నాయి. వడగాడ్పులు, అకాల వర్షాలు, అతివృష్టి ప్రభావం పౌర జీవనంపై అమితంగా ఉంది. వాతావరణ ప్రభావం మిక్కుటం కావడంతో పని చేసే ప్రదేశాల్లో సాటివారితో గొడవలు పడటం, చివరికి ఉద్యోగాలు కోల్పోవడం వంటివి కూడా జరుగుతున్నాయి.

వాతావరణ మార్పు ప్రభావం మనుషుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం ఎక్కువగా ఉంటోందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వేడిగాలులు, చల్లని గాలుల ప్రభావం మనిషి శరీరంపై  తీవ్రంగా ఉంటోంది. అలాగే, మానసిక ఆరోగ్యంపైన కూడా ఉంటోంది. అయితే, ఈ అంశాన్ని విధానపరమైన చర్చల్లో ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది. బెంగలనుంచి ఒత్తిడి వల్ల కలిగే వ్యధల వరకూ ఎక్కువగా  శాస్త్ర వేత్తలు,   సామాజిక ఉద్యమ కారులపై  కనిపిస్తోంది. యువతలో కూడా ఈ మాదిరి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.  విద్యార్ధులపై చదువుల భారం తో పాటు  వాతావరణ మార్పు ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. వాతావరణ మార్పు ప్రభావం ఎక్కువగా ఉంటోందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఎండ వేడిమి వల్ల మనషుల్లో అసహనం పెరుగుతోంది. ఇంట్లో తరచూ గొడవలూ, ఘర్షణలు జరుగుతున్నాయి. నిద్ర లేమితో జనం బాధ పడుతున్నారు.  ఏం చేయాలో పాలు పోని స్థితి  ఏర్పడుతోంది. మనసు స్థిరంగా ఉండదు. తీవ్రమైన వాతావరణ మార్పు ప్రభావం ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తోంది. గడిచిన కొద్ది దశాబ్దాలలో కన్నా ఇప్పుడు మనుషుల్లో అసహన ధోరణులు పెరిగిపోతున్నాయి. ఎవరిని పలకరించినా, సరైన రీతిలో సమాధానం చెప్పకపోవడం, చిరాకు పడటం,  మాట్లాడిన మాటల్లో అర్థం లేకపోవడం వంటి ధోరణులు ఎక్కువ కనిపిస్తున్నాయి. వడగాడ్పులు, అకాల వర్షాలు, అతివృష్టి ప్రభావం పౌర జీవనంపై అమితంగా ఉంది. వాతావరణ ప్రభావం మిక్కుటం కావడంతో పని చేసే ప్రదేశాల్లో సాటివారితో గొడవలు పడటం, చివరికి ఉద్యోగాలు కోల్పోవడం వంటివి కూడా జరుగుతున్నాయి. మిత్రులతో గొడవ పడుతున్నారు. దీర్ఘకాలికమైన మానసిక వ్యధలు ఏర్పడుతున్నాయి.
యార్క్ ‌యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌సోషల్‌ ‌రిసెర్చ్‌కి చెందిన శాస్త్రజ్ఞులు జరిపిన అధ్యయనంలో  వరదల వల్ల ఇళ్ళు కోల్పోయిన వారు, ఇళ్ళు ధ్వంసమైన వారి మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటోందని తేలింది. 2014లో యూకేలో అడల్ట్ ‌సైక్రియాటిక్‌  ‌మోరిబిడిటీ  సర్వేలో తేలిందేమంటే పెనుగాలులు, వర్షాలు, హిమపాతం, వరదలు  కారణంగా ప్రజల మానసిక స్థితిలో చాలా మార్పు వచ్చింది. వాటిల్లిన దాడికి వారు తట్టుకోలేకపోతున్నారు. మానసికం స్వస్థత లేని వారిలో  50 శాతం మంది పైగా ప్రకృతి వైపరీత్యాల్లో ఇళ్ళు కోల్పోయిన వారే. బాధితులలో భావోద్వేగమైన ఆందోళనలతో వారి  మనసులు కలవరపడుతున్నాయని యార్క యూనివర్శిటీకి చెందిన  ప్రొఫెసర్‌ ‌హిల్లరీ గ్రాహమ్‌  ‌పేర్కొన్నారు.

మన దేశంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏటా  అనూహ్యమైన రీతిలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో  భారీ వర్షాలు సంభవిస్తున్నాయి. ఉదాహరణకు కేరళ పరిస్థితే తీసుకుంటే వరసగా రెండేళ్ళ పాటు కేరళ వరదలతో వణికి పోయింది. ఆగస్టు రెండో వారంలో సంభవించిన వరదలు రాష్ట్రం తీవ్ర నష్టానికి గురి అయింది.  ప్రతి  ఏటా ఇలాగే  అకాల, అతి వర్షాలు సంభవిస్తాయేమోనని కేరళకు చెందిన వారు ఆందోళన చెందడం తనకు తెలుసునని ఢిల్లీ ఐఐటికి చందిన వాతావరణ శాస్త్ర కేంద్రం అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌ ‌కృష్ణ అచ్యుతరావు అన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావం  ప్రజల మానసిక ఆరోగ్యంపై ఉంటోందని ఆయన స్పష్టం చేశారు.

దుర్భిక్షం… రైతుల ఆత్మహత్యలు
వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై స్పష్టంగా కనిపిస్తోంది. దీర్ఘ కాలం దుర్భిక్షం, అకాల వర్షాలు పంటలను దెబ్బతీస్తున్నాయి. మన దేశంలో  ఇప్పటికీ సగం మందికి పైగా వ్యవసాయమే జీవనాధారం. వరుస దుర్భిక్షాల వల్ల రైతులు నిలువ నీడ లేకుండా నిరాశ్రయులవుతున్నారు. ఏటేటా  పరిస్థితి మరింత తీవ్రమవుతోందే తప్ప గుణాత్మకమైన మార్పు కనిపించడం లేదు. క్లైమేట్‌ ‌సైక్రియాట్రీ అలయెన్స్ ‌సహ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ‌లైస్‌ ‌వ్యాన్‌ ‌సస్టీరన్‌  ‌ప్రకృతి వైపరీత్యాల ప్రభావం మనుషులపై తీవ్రంగా ఉంటోందని  అన్నారు. ఇందుకు ఎన్నో  దృష్టాంతాలను ఆయన ఉదహరించారు.  పైగా, ఒకే వ్యక్తి సంపాదనపై ఆధారపడిన కుటుంబాలు చావలేని, బతకలేని స్థితిలో ఉన్నాయని ఆయన అన్నారు. వ్యవసాయం నష్టం వస్తున్నా, తరతరాల వృత్తి కావడం వల్ల దానిని వదల లేకపోతున్నారని ఆయన అన్నారు.

ఎప్పుడెలా ఉంటుందోనన్న  బెంగ
ఢిల్లీకి చెందిన వాతావరణ కార్యకర్త  భావ్రీన్‌  ‌కాంధారీ తన పిల్లలకు వాతావరణ మార్పు వల్ల తరచూ జలుబు, జ్వరం, దగ్గు వస్తున్నాయని పిల్లలిద్దరూ నాలుగు దేళ్ళ వయసు వారు కావడం వల్ల తమ ఆందోళనను పంచుకోలేకపోతున్నారని ఆమె అన్నారు. ఇలా ఎంత కాలం పిల్లల్ని సాకాలో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. పిల్లల ఆరోగ్యంపై బెంగ పట్టుకుందని ఆమె అన్నారు. వాతావరణ మార్పుల వల్ల ప్రకృతిలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. మానసిక ఆరోగ్యంపై  పడే దుష్ప్రభావం అన్నింటిపైనా ఉంటుంది. మిత్రులు, బంధువులు,  ఇంట్లో  వారు,  అందరితోనూ తగాదాలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలపై కూడా తీవ్రంగా ఉంటుంది. మానసిక స్వస్థత ఉంటేనే మనిషి ఏదైనా సాధించగలడు. వృత్తి ఉద్యోగాల్లో రాణించగలడు. మూలుగుతూ ముక్కుతూ జీవనం సాగించడం అనేది  ఒక శాపం.

–   ‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!