వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో వివిధ పార్టీల నుండి టి ఆర్ ఎస్ లో చేరికలు..

April 7, 2019

ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీ తోని పోటీ లేదు..మెజార్టీ పైనే పోటీ.. ఏ నియోజకవర్గం ఎంత మెజార్టీ అనే దానిపై పోటీ పడుతున్నట్టు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.. సిద్దిపేట లో చిన్నకొడుర్ మండల విఠలాపూర్ గ్రామానికి చెందిన బిజెవైఎం జిల్లా కార్యదర్శి సింగిరెడ్డీ సాగర్ రెడ్డి తో పాటు 30మంది యువకులు , నంగునూర్ మండల బద్దీపడగా గ్రామానికి చెందిన కాయతి మహేష్ , రమేష్ ,యాదయ్య, కిష్టా గౌడ్ లు కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుండి లక్ష మెజార్టీ ఇచ్చారు అని.. ఈ లక్ష మెజార్టీ పై ఈ ఎంపీ ఎన్నికల్లో 7నియోజకవర్గాలు పోటి పడుతున్నాయన్నారు..ఈ ఎంపీ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ పార్టీ కి ఏ పార్టీ పోటీ లేదు..బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య టి ఆర్ ఏస్ కి పోటీ కాదు.. సిద్దిపేట ,దుబ్బాక ,గజ్వేల్ , నర్సాపూర్ ,సంగారెడ్డి ,పఠాన్ చెరువు , మెదక్ నియోజకవర్గాల మెజార్టీ పైనే పోటీ నడుస్తుంది అని అన్నారు.. సిద్దిపేట లక్ష మెజార్టీ వచ్చింది మరి మా నియోజకవర్గాల్లో కూడా తేవాలి అని ఎమ్మెల్యే లు పోటీ పడుతున్నారు.. అంటే మన సిద్దిపేట అభివృద్ధి లో స్పూర్తి…మెజార్టీ లో స్పూర్తి అని సిద్దిపేట ప్రజలు గొప్ప గౌరవాన్ని ఇచ్చారు అని తెలిపారు.. కాంగ్రెస్ ,బిజెపిలను ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు అని.. లక్ష మెజార్టీ లక్ష్యంగా అందరం కలిసి పని చేయాలని ఈ సందర్భంగా కొరారు.. కొత్త ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తో అగ్రస్థానంలో నిల్పాలన్నారు..
బిజెపి , కాంగ్రెస్ నుండి చెరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు.