వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మాకు మీరు..మీకు మేము..

April 8, 2019

మరో సారి మెజార్టీ లో సిద్దిపేట ఆదర్శంగా నిలవాలి: హరీష్‌ ‌రావు
టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి మద్దతు ప్రకటించిన హోసింగ్‌ ‌బోర్డ్ ‌వెల్ఫేయిర్‌ అసోసియేషన్‌సిద్దిపేట పట్టణంలో హౌసింగ్‌ ‌బోర్డ్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎంపీ ఎన్నికల్లో టి ఆర్‌ ఎస్‌ ‌పార్టీకి మద్దతు ప్రకటించారు..ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు , ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో మనకు ఏ పార్టీ తో పోటీ లేదు.. ఇక్కడ ఏ పార్టీ లు కూడా లేవు..తొలకరి వాన కు వచ్చే ఊసిళ్లలా ఈ కాంగ్రెస్‌ ,‌బిజెపి పార్టీలు ఎన్నికల్లో వచ్చి కనపడతారు.. ఎన్నికలు అయితే కనపడకుండా పోతారు.. ఆ పార్టీలు ఎప్పటికైనా కనమరుగుకాకా తప్పవన్నారు.. మీకు మేము..మాకు మీరుగా ఒక కుటుంభ సభ్యుల్ల ఉంటున్నాం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపారు.. మీ మేలు మరిచిపోలేనిది అని అన్నారు.. సిద్దిపేట అభివృద్ధి లో..మెజార్టీ లో ఫస్ట్ అని చాటి చెప్పారన్నారు.. అదే స్ఫూర్తితో ఎంపీ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. మన హోసింగ్‌ ‌బోర్డ్ ‌కాలనీ న ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాం అని.మంచి ఆహ్లదమైన పార్క్ ‌ని ఏర్పాటు చేసుకున్నామన్నారు..కాలనీని మరింత అభివృద్ధి చేసుకుందాం అని చెప్పారు.. కాలనిలో ఉండే బెడ బుడగ సంఘం, గంగిరెద్దుల సంఘం , వడ్డెర సంఘం వారి ఆత్మీయతను..ఆదరణ ను ఎప్పటికి మరిచి పోను అని.. మేము మీ సేవలో ఉంటమన్నారు.. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ లో రాష్ట్రంలో ఫస్ట్ ‌వచ్చాము… ఎంపీ ఎన్నికల్లో సిద్దిపేట నుండి లక్ష మెజారిటీ ఇచ్చి దేశంలో నెంబర్‌ ‌వన్‌ ‌గా నిలుద్దామన్నారు…
ఆశీర్వదించండి… మీ సేవలో ఉంటా : ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి
మీ ఆత్మీయత.. మీ అభిమానము చూస్తుంటే మీకు ఎంత సేవ చేసిన తక్కువే..ఎంపీగా 5ఏళ్ళు సేవ చేశా..మరో సారి ఆశీర్వదించండి 5ఏళ్ళు మీ సేవలో ఉంటా.హరీష్‌ ‌రావు బాటలో…సిద్దిపేట అభివృద్ధి లో భాగస్వామ్యం అవుతాన్నారు..మీకు అవసరం ఉన్న అండగా ఉంటానన్నారు.