Take a fresh look at your lifestyle.

మహిళా హోమంత్రి ఉన్నా తప్పని దాడులు

తక్షణం సుచరిత రాజీనామా చేయాలి : మాజీ ఎమ్మెల్యే
విజయనగరం,ఆగస్ట్ 20 :  ‌రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు భాధ్యత వహిస్తూ హోంమంత్రి సుచరిత తక్షణమే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే డా.కొండపల్లి అప్పలనాయుడు డిమాండ్‌ ‌చేశారు. రాష్టాన్రికి మహిళా హోంమంత్రిగా ఉన్నా ఉపయోగం లేదని విమర్శించారు. విజయ నగరం జిల్లాలో పూసపాటిరేగ మండలం చౌడవాడలో ఒక యువతి, యువతి అక్క, అక్క కొడుకుపై ఒక యువకుడు పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించడం జరిగింది. ఈ ఘటనలో గాయాల పాలై జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన డియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని, ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. స్వాతంత్య దినోత్సవం నాడే మహిళ దారుణహత్యకు గురైందని, తర్వాత మానసిక దివ్యాంగురాలిపై సామూహిక హత్యాచారం జరగడం, ఈ రోజు విజయనగరంలో ఈ దాడి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లేనని జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పరామర్శలో తెలుగుయువత పార్లమెంటు అధ్యక్షులు వేమలి చైతన్య బాబు, మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర నాయుడు, గజపతినగరం తెలుగుయువత అధ్యక్షులు పెడిరెడ్ల సతీష్‌, ‌టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ‌పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మాడుగుల భాను ప్రకాష్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply