వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మహిళల ఖాతాల్లోకి రు . 72 వేలు

April 1, 2019

తెలంగాణ బహిరంగ సభల్లో రాహుల్‌ ‌గాంధీరానున్న లోకసభ ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపడితే దేశంలో 20 శాతంగా వున్న అత్యంత పేదలకు ఏటా 72వేలు రూ.అందజేస్తామని కాంగ్రెస్‌ ‌ఛీఫ్‌ ‌రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం దగ్గర ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌కు అధికారమిస్తే జిఎస్టీని రద్దుచేస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ధనవంతులదే రాజ్యమని ఆయన విమర్శించారు. నీళ్లు, నిధులు నియామకాలు, ఆత్మగౌరవం కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారులు ఆ సమయంలో ఎన్నో కలలు కన్నారని ఆ కలల సాకారాన్ని, ఉత్సాహాన్ని కల్వకుంట్ల కుటుంబమే దోపిడీ చేస్తుందని ప్రజలు ఊహించలేదని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌యువతను దోపిడికి గురిచేశారని, నరేంద్రమోడి దేశంలో 2014 లో అధికారం కోసం అబద్ధాలు చెప్పి బయటపడ్డారని, 2కోట్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, మద్దతుధర కల్పిస్తామని జూటా మాటలు చెప్పారని రాహుల్‌ ‌విమర్శించారు. దేశంలో 15 నుంచి 20 మంది అత్యంత సంపన్నుల ధనవంతులకే లబ్ది చేకూర్చారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ప్రలి ఒక్కరి ఖాతాలో 15లక్షలు వేస్తామని చెప్పడంతో ఈ దేశ ప్రజలు నమ్మి ప్రధానమంత్రిని చేశారని అన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు, నిరుపేదల కుటుంబాల మహిళల ఖాతాల్లో 15లక్షలు ఇస్తామని మోసం చేసిన మోదికి ధీటుగా సమాధానం చెప్పాలని రాహుల్‌ అన్నారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌ ‌పార్టీ 72 వేల రూ।।ల కనీస ఆదాయాని ప్రతి కుటుంబానికి అందించాలన్నదే ముఖ్య ఉద్ధేశ్యమని, ఆ ఆలోచనతోనే 21వ శతాబ్దంలో కనీసం ప్రతి నెల 12వేల రూ. ఆదాయం సంపాదన ఉండాలనేది తమ లక్ష్యమని ఆయన అన్నారు.. అందుకే 20శాతం అత్యంత నిరుపేదలకు బ్యాంకు ఖాతాలో 72వేలు వేస్తామని, 25కోట్ల మంది భారతీయులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని తెలిపారు.రైతులకు, చిరువ్యాపారులకు, యువతులకు, మాతాశిశు పథకాలను చేపట్టి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుతామని అన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని నరేంద్రమోది చెప్పిన మాటలపై తాను ఆర్థివేత్తల సలహా తీసుకున్నాని తెలిపారు